ఏ సమయమందైనా ఏ స్థలమందైనా | Ye Samayamandaina Ye Sthalamandaina

Telugu Lyrics

Ye Samayamandaina song lyrics in Telugu

సమయమందైనా స్థలమందైనా – ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2)

ఆరాధనా ఆరాధనా – నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా

ఆరాధనా ఆరాధనా – గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా     || ఏ సమయమందైనా ||


1.చెరసాలలో నేను బంధీగా ఉన్నా – సింహాల బోనులో పడవేసినా

కరువు ఖడ్గము హింస ఏదైననూ – మరణ శాసనమే పొంచున్ననూ (2)

యేసు నామమే ఆధారము కాదా – యేసు రక్తమే నా విజయము..

పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో – కునుకక కాపాడు యేసు దేవునికే     || ఆరాధనా ||


2.నా జీవనాధారం శ్రీ యేసుడే – నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే

తన చేతులతో నన్ను నిర్మించెగా – నా సృష్టికర్తను కొనియాడెదన్  (2)

యెహోవ రాఫా నను స్వస్థపరిచెను – యెహోవ షమ్మా నాకు తోడుగా

యెహోవ నిస్సీ నా ధ్వజముగా – అల్ఫా ఒమేగా ఆది దేవునికే    || ఆరాధనా ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ye Samayamandaina Ye Sthalamandaina song lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro