ప్రేమపూర్ణుడా స్నేహ శీలుడా | Premapoornuda Snehaseeluda Song Lyrics

ప్రేమపూర్ణుడా స్నేహ శీలుడా | Premapoornuda Snehaseeluda Song Lyrics || Viswanaadhuda || Hosanna Ministries 2024 New Song

Telugu Lyrics

Premapoornuda Snehaseeluda Song Lyrics in Telugu

ప్రేమపూర్ణుడా స్నేహ శీలుడా – విశ్వనాథుడా విజయవీరుడా

ఆపత్కాలమందున – సర్వలోకమందున్న

దీనజనాళి దీపముగా – వెలుగుచున్నవాడా

ఆరాదింతు నిన్నే – లోక రక్షకుడా

ఆనందింతు నీలో – జీవితాంతము

నీ కృప ఎంత ఉన్నతమో – వర్ణించలేను స్వామి

నీ కృపయందు తుదివరకు – నడిపించు యేసయ్యా     || ప్రేమ పూర్ణుడా ||


1. పూర్ణమై సంపూర్ణమైన – నీ దివ్య చిత్తమే

నీవు నను నడిపే – నూతనమైన జీవమార్గము (2)

ఇహమందు పరమందు – ఆశ్రయమైనవాడవు

ఇన్నాళ్లు క్షణమైనా – నన్ను మరువని యేసయ్య

నా తోడు నీవుంటే – అంతే చాలయ్యా

నా ముందు నీవుంటే – భయమే లేదయ్యా (2)     || ప్రేమ పూర్ణుడా ||


2. భాగ్యమే సౌభాగ్యమే – నీ దివ్య సన్నిధి

బహు విస్తారమైన నీ కృప – నాపై చూపితివి (2)

బలమైన ఘనమైన – నీ నామమందు హర్షించి

భజియించి కీర్తించి – ఘనపరతును నిన్ను యేసయ్య

నా తోడు నీవుంటే – అంతే చాలయ్యా

నా ముందు నీవుంటే – భయమే లేదయ్యా (2)     || ప్రేమ పూర్ణుడా ||


3. నిత్యము ప్రతి నిత్యము – నీ జ్ఞాపకాలతో

నా అంతరంగమందు నీవు – కొలువై ఉన్నావులే (2)

నిర్మలమైన నీ మనసే – నా అంకితం చేసావు

నీతోనే జీవింప నన్ను కొనిపో – యేసయ్య

నా తోడు నీవుంటే – అంతే చాలయ్యా

నా ముందు నీవుంటే – భయమే లేదయ్యా (2)     || ప్రేమ పూర్ణుడా ||

English Lyrics

Premapoornuda Snehaseeluda Song Lyrics in English

Premapoornuda Snehaseeluda – Viswanaadhuda Vijayaveeruda

Aapathkaalamandhuna – Sarvalokamandhunna

Dheena Janaali Dheepamuga – Veluguchunnavada

Aaradhinthu Ninne – Loka Rakshakudaa

Aanandhinthu Neelo – Jeevithaanthamu

Nee Krupa Entha Unnathamo – Varninchalenu Swami

Nee Krupayandhu Thudhivaraku – Nadipinchu Yesayyaa     || Premapoornuda ||


1. Poornamai Sampoornamaina – Nee Dhivya Chitthame

Neevu Nanu Nadipe – Noothanamaina Jeeva Maargamu (2)

Ihamandhu Paramandhu – Aasrayamainavaadavu

Innallu Kshanamaina – Nannu Maruvani Yesayya

Naa Thodu Neevunte – Anthe Chalayyaa

Naa Mundhu Neevunte – Bhayame Ledhayyaa (2)      || Premapoornuda ||


2. Bhagyame Saubhagyame – Nee Dhivyasannidhi

Bahu Vistaramaina Nee Krupa – Naapai Choopithivi (2)

Balamaina Ghanamaina – Nee Naamamandhu Harshinchi

Bhajiyinchi Keerthinchi – Ghanaparathunu Ninnu Yesayya

Naa Thodu Neevunte – Anthe Chalayyaa

Naa Mundhu Neevunte – Bhayame Ledhayyaa (2)      || Premapoornuda ||


3.Nithyamu Prathi Nithyamu – Nee Gnapakaalatho

Naa Antharangamandhu Neevu – Koluvai Unnavule (2)

Nirmalamaina Nee Manase – Naa Ankitham Chesavu

Neethone Jeevimpa Nannu Konipo – Yesayya

Naa Thodu Neevunte – Anthe Chalayyaa

Naa Mundhu Neevunte – Bhayame Ledhayyaa (2)     || Premapoornuda ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Click Here for Song Track Music

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

More Telugu Christian New Year Songs

Click Here for more Telugu Christian New Year Songs

Leave a comment

You Cannot Copy My Content Bro