సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు | Sariraarayya Yesayya Neekevvaru Song Lyrics

సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు | Sariraarayya Yesayya Neekevvaru Song Lyrics || Krupa Ministries New Year Song 2024

Telugu Lyrics

Sariraarayya Yesayya Neekevvaru Song Lyrics in Telugu

సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు – సదాతోడు నిలిచావు నా అండవై (2)

భయమేమీ లేదు నా బలము నీవే – ఓటమే లేదు నా జయము నీవే (2)

అభినందనం నీకే నా యేసయ్యా – అభిషిక్తుడా నీకే నా ఆరాధన (2)   || సరిరారయ్యా ||


1. దివిలో ఉన్న దీవెనలన్నీ- భువికే దించిన బహుఘనుడవు (2)

నీ సన్నిధిలో నిలిచి – అడిగిన ప్రతివారికీ (2)

సిరులను కురిపించే – శ్రీమంతుడవు (2)     || అభినందనం ||


2. ఎదురౌతున్న పోరాటాలలో – నాతో నిలిచిన బహుశూరుడా (2)

నీ నామం స్మరింయించి – స్తుతించిన ప్రతి వారికి (2)

జయ జీవితమిచ్చే – విజయకరుడా (2)      || అభినందనం ||


3. మంటి ఘటమైన నాలో నీవు – మహిమైశ్వర్యమును నింపితివి (2)

మారని నీ కృపతో – నీ మమతల కోటలో (2)

జీవించెద కృతజ్ఞతతో – కృపాకరుడా (2)    || అభినందనం ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Telugu Christian New Year Songs

Click Here for more Telugu Christian New Year Songs

Leave a comment

You Cannot Copy My Content Bro