సదయుడా నా యేసయ్యా | Sadayuda Naa Yesayya Song Lyrics

సదయుడా నా యేసయ్యా | Sadayuda Naa Yesayya Song Lyrics || Latest Telugu Christian Song by Thandri Sannidhi Ministries

Telugu Lyrics

Sadayuda Naa Yesayya Song Lyrics in Telugu

సదయుడా నా యేసయ్యా – స్తుతి ఘనతా మహిమ నీకేనయ్యా (2)

ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి – విడువక ప్రేమించితివే ఎడబాయక కాచితివే (2)

నీవే స్తుతి గానము – నీవే నా విజయము – నీవే నా అతిశయం యేసయ్యా (2)    || సదయుడా ||

1. నా సరిహద్దులలో – నెమ్మది కలుగగా – కారణము నీవే…

కృపాక్షేమము – నావెంట నిలువగ – కనికరము నీదే… (2)

సన్నుతించెదనూ…  ఊపిరున్నంత వరకూ…

విశ్రమించను నేను… – నిన్ను చేరేంత వరకూ…. (2)

నిన్ను చేరేంత వరకూ…

నీవే స్తుతి గానము – నీవే నా విజయము – నీవే నా అతిశయం యేసయ్యా (2)    || సదయుడా ||

2. పలు విధములుగా – నిను విసిగించినా – నను సహియించితివే

పూర్ణ ఓరిమితో – నను భరియించి – భుజమున మోసితివే (2)

సన్నుతించెదనూ…  ఊపిరున్నంత వరకూ…

విశ్రమించను నేను… – నిన్ను చేరేంత వరకూ…. (2)

నిన్ను చేరేంత వరకూ…

నీవే స్తుతి గానము – నీవే నా విజయము – నీవే నా అతిశయం యేసయ్యా (2)    || సదయుడా ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Telugu Christian Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro