ప్రతీ క్షణం నీతో ఉండాలని | Prathi Kshanam Neetho Undalani Song Lyrics

ప్రతీ క్షణం నీతో ఉండాలని | Prathi Kshanam Neetho Undalani Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Prathi Kshanam Neetho Undalani Lyrics in Telugu

ప్రతీ క్షణం నీతో ఉండాలని – నే ఆశతో ఉన్నాను నా యేసయ్యా

నా జయము నీ ఆత్మతో శాశ్వతమని – నే బ్రతుకుచున్నానయా   || ప్రతీ క్షణం ||


1. నిన్ను విడువనని ఎడబాయను అని అన్నావు

నాకు నిత్యము నీవు తోడై నడిపించుచున్నావు (2)

నమ్మాను విశ్వసించాను – యేసు నీవే నా మార్గము

నమ్మాను విశ్వసించాను – యేసు నీవే నా జీవము   || ప్రతీ క్షణం ||


2. నీ బాహువు ముఖకాంతియే అన్నిటిలో జయమిచ్చెను

మమ్ము కటాక్షించు రారాజువు నీవేనయ్యా (2)

నమ్మాను విశ్వసించాను – యేసు నీవే నా అతిశయం

నమ్మాను విశ్వసించాను – యేసు నీవే నా పరవశం   || ప్రతీ క్షణం ||


3. నీ ఉపదేశమే ఎల్లపుడు బ్రతికించుచున్నది

నా ప్రాణాత్మకు అవి మనుగడై యున్నవి (2)

నమ్మాను విశ్వసించాను – యేసు నీవే నా సర్వము

నమ్మాను విశ్వసించాను – యేసు నీవే సమస్తము    || ప్రతీ క్షణం ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics,Tune & Producer: Bro. Srinivas

Vocals: Bro. Nissy John Garu

Music: Jonah Joe

Chorus: Revathy Garu

Studio: John Wesley studios

Mix & Mastered: Gideon Gid

Editing & VFX: Bro. David Varma

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro