కన్నీరంతా కాలం చేసిన | Kannirantha Kaalam Chesina Song Lyrics

కన్నీరంతా కాలం చేసిన | Kannirantha Kaalam Chesina Song Lyrics || Telugu Christian Comfort Songs

Telugu Lyrics

Kannirantha Kaalam Chesina Song Lyrics in Telugu

కన్నీరంతా కాలం చేసిన – కష్టాలన్నీ కలగా మార్చిన

చిరునవ్వునే ఇచ్చిన- నా చింతలే తీసిన (2)

నీకే ఆరాధన స్తుతి ఆరాధన – యేసయ్య నీకే ఈ ఆరాధన

ఆరాధనా ఆరాధన – యేసయ్య నీకే ఈ ఆరాధన   || కన్నీరంతా ||


1. కుమిలి కుమిలి ఏడ్వగ నేను – కుమారుడా భయపడకూ అని

కృంగి పోతూ ఉండగా నేను – కన్నా నీకున్నా నేనని (2)

కన్నీటి సంద్రంలో – కలవరాల కాలములో (2)

కరుణతో కమ్మి – కలతలే తరిమి – కన్న ప్రేమ చూపి (2)

చిరునవ్వునే ఇచ్చిన- నా చింతలే తీసిన (2)       || నీకే ఆరాధన ||


2. ఎగరేసే సుడిగాలైన – ఎన్నడు ఇక కదల్చకుండా

చెలరేగే తుఫాను అయినా – ఎన్నడు నను ముంచకుండా (2)

శోధింపబడిన నన్ను – శుద్ధ సువర్ణము చేసి (2)

నిశ్చలమైన స్థలమునకు – నను తీసుకుని వచ్చి (2)

చిరునవ్వునే ఇచ్చిన- నా చింతలే తీసిన (2)       || నీకే ఆరాధన ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, and Vocals- Ram Nagupadu

Music- Raghavan

More Comfort Songs

Click Here for more Telugu Christian Comfort Songs

Leave a comment

You Cannot Copy My Content Bro