పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు | Parishudhudavai Mahima Song Lyrics

Telugu Lyrics

Parishudhudavai Mahima Prabhavamulaku Song Lyrics in Telugu

పరిశుద్ధుడవైమహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు

బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2)

దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా


ఆరాధన నీకే నా యేసయ్యా – స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా

సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో  (2)       || పరిశుద్ధుడవై ||


1.నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు

నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2)

శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి

నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి         || ఆరాధన ||


2.నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు

నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి (2)

నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి

నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి         || ఆరాధన ||


3.ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు

నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి (2)

మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము

నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు         || ఆరాధన ||

English Lyrics

Parishudhudavai Mahima Prabhavamulaku Song Lyrics in English

Parishudhudavai – Mahima Prabhavamulaku Neeve Pathrudavau

Balavanthudavai – Dheenula Pakshamai Krupa Choopuvadavu (2)

Dhayaludavai – Dharalamugaa Nanu Dheevinchina Sreemanthuda


Aaradhana Neeke Naa Yesayya – Sthuthi Aaradhana Neeke Naa Yesayya

Sevinchedha Ninne Naa Purna Hrudhayamutho (2)   (Parishudhudavai )


1.Nee Swasthyamaina Nee Varitho Kalisi Ninu Sevinchutaku

Nee Mahima Prabhavamunu Kireetamugaa Dharimpajesithivi (2)

Saaswatha Kaalamu Varaku Nee Santhathipai Dhrusti Nilip

Nee Dhasula Prardhanalu Saphalamu Chesithivi  || Aaradhana ||


2.Nee Nithyamaina Aadharan Choopi Nanu Sthiraparachutaku

Nee Karuna Katakshamunu Naapai Kuripinchi Nanu Preminchithivi (2)

Naku Prayojanamu Kalugajeyutaku Nee Upadhesamu Bodhinchi

Nee Dhasuni Pranamunu Santhoshaparachithivi  || Aaradhana ||


3.Aanandhakaramaina Dhesamulo Nenu Ninu Ghanaparachutaku

Nee Mahimaathmatho Nimpi Surakshithamugaa Nannu Nivasimpajesithivi (2)

Megha Vaahanudavai Vachhuvaraku Ne Kanipittuchundhunu Nee Kosamu

Nee Dhasula Kaankshanu Sampoornaparachedhavu   || Aaradhana ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Parishudhudavai Mahima Song Lyrics

Track Music

Parishudhudavai Mahima Prabhavamulaku Track Music

MP3 song Download

Parishudhudavai Mahima Prabhavamulaku MP3 song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro