లేచినాడురా సమాధి | lechinadura samadhi | lechinadura samadhi Song lyrics

Telugu Lyrics

lechinadura samadhi Song lyrics in Telugu

లేచినాడురా సమాధి గెలిచినాడురా – యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా

లేతునని తా జెప్పినట్లు (2)

లేఖనములో పలికినట్లు (2) (లేచినాడురా)


1. భద్రముగ సమాధిపైని – పెద్దరాతిని యుంచిరి భటులు (2)

ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న (2) (లేచినాడురా)


2. ప్రభువు దూత పరమునుండి – త్వరగా దిగి రాతిని పొర్లించి (2)

భళిరే దానిపై కూర్చుండె – భయమునొంద కావలివారు (2) (లేచినాడురా)


3. పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు  (2)

శ్రద్ధతోడ తెచ్చి యేసుకు – రుద్దుదామని వచ్చి చూడ  (2) (లేచినాడురా)


4. చూడవెళ్లిన స్త్రీలను దూత – చూచి యపుడే వారితోడ  (2)

లేడు గలలియ ముందుగ పోతున్నాడు – అపుడె లేచినాడని  (2) (లేచినాడురా)


5. చచ్చిపోయి లేచినాడు – స్వామి భక్తుల కగుపడినాడు (2)

చచ్చినను నను లేపుతాడు – చావు అంటే భయపడరాదు  (2) (లేచినాడురా)


6. నేను చేసే పనులనెరుగు – నేను నడిచే మార్గమెరుగు  (2)

నేను చేప్పు మాటలెరుగు – నేను బ్రతికే బ్రతుకు నెరుగు  (2) (లేచినాడురా)


7. నేను లేచిన యేసునందు – మానక మది నమ్ముకొందు – తాను (2)

నాలోయుండినందున – దయను జేర్చు మోక్షమందు (2) (లేచినాడురా)


8. పాపభారము లేదు మనకు – మరణ భయము లేదు మనకు (2)

నరక బాధ లేదు మనకు – మరువకండి యేసు ప్రభుని (2) (లేచినాడురా)


9. యేసు నందే రక్షణ భాగ్యం – యేసు నందే నిత్య జీవం  (2)

యేసు నందే ఆత్మ శాంతి – యేసు నందే మోక్ష భాగ్యం  (2) (లేచినాడురా)


10. పాపులకై వచ్చినాడు – పాపులను కరుణించాడు  (2)

పాపులను ప్రేమించినాడు – ప్రాణదానము చేసినాడు  (2)  (లేచినాడురా)

English Lyrics

lechinadura samadhi Song lyrics in English

Lechinaaduraa Samadhi Gelichinaaduraa – Yesu Lechinaaduraa Samadhi Gelichinaaduraa

Lethunani Thaa Cheppinatlu  (2)

Lekhanamulo Palikinatlu  (2) (Lechinaaduraa)


1. Bhadramuga Samaadhipaini – Peddharaathini Unchiri Bhatulu (2)

Mudravesi Raathriyantha Nidraleka Kaavaliyunna (2) (Lechinaaduraa)


2. Prabhuvu Dhootha Paramunundi – Thwaragaa Dhigi Raathini Porlinchi (2)

Bhalire Dhaanipai Koorchunde – Bhayamunondha Kaavalivaaru (2) (Lechinaaduraa)


3. Poddhu Podavakamundhe Sthreelu Siddhaparachina Sugandhamulu (2)

Sraddhathoda Thechi Yesuku – Ruddhudhamani Vachi chooda (2) (Lechinaaduraa)


4. Choodavellina Sthreelanu Dhootha – Choochi Yapude Vaarithoda (2)

Ledu Galaliya Mundhuga Pothunnadu – Apude Lechinaadani (2) (Lechinaaduraa)


5.Chacchipoyi Lechinaadu – Swami Bhakthula Kagupadinaadu (2)

Chacchinanu Nanu Leputhaadu – Chaavu Ante Bhayapadaraadhu (2) (Lechinaaduraa)


6.Nenu Chese Panulanerugu – Nenu Nadiche Maargamerugu (2)

Nenu Cheppu Maatalerugu – Nenu Brathike Brathuku Nerugu (2) (Lechinaaduraa)


7.Nenu Lechina Yesunandhu – Maanaka Madhi Nammukondhu – Thaanu (2)

Naaloyundinandhuna – Dhayanu Jerchu Mokshamandhu (2) (Lechinaaduraa)


8. Paapabhaaramu Ledhu Manaku – Marana Bhayamu Ledhu Manaku (2)

Naraka Baadha Ledhu Manaku – Maruvakandi Yesu Prabhuni (2) (Lechinaaduraa)


9. Yesunandhe Rakshana Bhaagyam – Yesu Nandhe Nithya Jeevam (2)

Yesunandhe Aathma Saanthi – Yesunandhe Moksha Bhagyam (2) (Lechinaaduraa)


10. Paapulakai Vachinaadu – Paapulanu Karuninchadu (2)

Papulanu Preminchinaadu  – Praanadhaanamu Chesinaadu  (2) (Lechinaaduraa)

Song Credits

Music: Jk Christopher

Vocals: Philip Gariki

Mix & master: J. Vinay kumar

DOP & Edit: Lillian Christopher

Cast: Bobby Vedala, Allen Oliver

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

lechinadura samadhi song lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro