కావాలి కావాలి లిరిక్స్ | Kaavali Kaavali Song Lyrics | Thandri Sannidhi Ministries 2023 New Year Song

Telugu Lyrics

Kaavali Kaavali Song Lyrics in Telugu

కావాలి కావాలి యేసు నీవే కావాలి – రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి (2)

నువ్వు లేకుండా నేనుండలేనయ్య – నీ తోడు లేకుండా జీవించలేనయ్యా

అండ దండ నీవే యేసయ్యా – నా కొండ కోట నీవే యేసయ్యా (2) (కావాలి కావాలి)

1.నా క్షేమదారము నువ్వే ఈ జగతిలో- ఆక్షేపణ చేయను నేను ఏ కొరతలో (2)

కలతలలో నేనున్నా కలవరపడనయ్యా – నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్య  (2)

నువ్వు లేకుండా నేనుండలేనయ్య – నీ తోడు లేకుండా జీవించలేనయ్యా

అండ దండ నీవే యేసయ్యా – నా కొండ కోట నీవే యేసయ్యా (2)  (కావాలి కావాలి)

2.ఎడారి అయినా పుష్పిస్తుంది  చల్లని నీ  చూపులతో – మండుటెండ మంచు అవుతుంది నీ దర్శన వేళలలో  (2)

అశైన స్వాసైన నీవే యేసయ్యా – నా ఊసైన ధ్యాసైనా నీమీదేనయ్యా (2)

నువ్వు లేకుండా నేనుండలేనయ్య – నీ తోడు లేకుండా జీవించలేనయ్యా

అండ దండ నీవే యేసయ్యా – నా కొండ కోట నీవే యేసయ్యా (2)  (కావాలి కావాలి)

3. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యేగా – నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా (2)

వేదనని వేడుకగా మలచిన యేసయ్య – వెల్లువలా నీ కృపయే దొరికెను చాలయ్య (2)

నువ్వు లేకుండా నేనుండలేనయ్య – నీ తోడు లేకుండా జీవించలేనయ్యా

అండ దండ నీవే యేసయ్యా – నా కొండ కోట నీవే యేసయ్యా (2)  (కావాలి కావాలి)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Leave a comment

You Cannot Copy My Content Bro