Telugu Lyrics
Amarudavu Neevu Naa Yesayya Song Lyrics in Telugu
అమరుడవు నీవు నాయేసయ్యా – ఆదియు అంతము నీవేనయ్యా (2)
ఆదిలోనున్న నీ వాక్యమే – ఆదరించెను శ్రమకొలిమిలో (2)
సొమ్మసిల్లక సాగిపోదును – సీయోను మార్గములో
స్తోత్రగీతము ఆలపింతును – నీదివ్య సన్నిధిలో || అమరుడవు ||
1.శక్తికి మించిన సమరములో – నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్నీ – ఉన్నత కృపతో నను నింపుటకే (2)
ప్రతి విజయము నీకంకితం – నాబ్రతుకే నీ మహిమార్థం
లోకమంతయు – దూరమైనను – నను చేరదీసెదవు
దేహమంతయు – ధూళియైనను – జీవింపజేసెదవు || అమరుడవు ||
2.వేకువకురిసిన చిరుజల్లులో – నీకృప నాలో ప్రవహించగా –
పొందితినెన్నో ఉపకారములు – నవనూతనమే ప్రతిదినము (2)
తీర్చగలనా నీ ఋణమును – మరువగలనా నీ ప్రేమను
కన్నతండ్రిగ – నన్ను కాచి – కన్నీరు తుడిచితివి
కమ్మనైన – ప్రేమ చూపి – కనువిందు చేసితివి || అమరుడవు ||
3.జల్దరు వృక్షమును పోలిన – గుణశీలుడవు నీవేనయ్యా –
మరణము గెలిచిన పరిశుద్ధుడవు – పునరుత్థానుడవు నీవయ్యా(2)
జయశీలుడవు నీవేనని – ఆరాధింతును ప్రతి నిత్యము
గుండె గుడిలో – నిండినావు – నీకే ఆరాధన
ఆత్మదీపము – వెలిగించినావు – నీకే ఆరాధన || అమరుడవు ||
English Lyrics
Amarudavu Neevu Naa Yesayya Song Lyrics in English
Amarudavu Neevu Naa Yesayya – Aadhiyu Anthamu Neevenayyaa (2)
Aadhilonunna Nee Vakyame – Aadharinchenu Sramakolimilo (2)
Sommasillaka Saagipodhunu – Seeyonu Maargamulo
Sthothrageethamu Aalapinthunu – Nee Dhivya Sannidhilo || Amarudavu ||
1. Sakthiki Minchina Samaramulo – Nerpithivi Naku Nee Chitthame –
Sikshaku Kaave Sodhanalanni.. – Unnatha Krupatho Nanu Nimputake (2)
Prathi Vijayamu Nee Kankitham – Naabrathuke Nee Mahimaardham
Lokamanthayu – Dhooramainanu – Nanu Cheradheesedhavu
Dhehamanthayu – Dhooliyainanu – Jeevimpajesedhavu || Amarudavu ||
2.Vekuvakurisina Chirujallulo – Nee Krupa Nalo Pravahinchaga –
Pondhithinenno Upakaaramulu – Navanoothaname Prathidhinamu (2)
Theerchagalanaa Nee Runamunu – Maruvagalanaa Nee Premanu
Kanna Thandria – Nannu Kaachi – Kanneeru Thudachithivi
Kammanaiana – Prema Choopi – Kanuvindhu Chesithivi || Amarudavu ||
3. Jaldharu Vrukshamunu Polina – Gunaseeludavu Neevenayyaa –
Maranamu Gelichina Parishuddhudavu – Punarudhanudavu Neevenayya (2)
Jayaseeludavu Neevenani – Aaradhinthunu Prathi Nithyamu
Gunde Gudilo – Nindinaavu – Neeke Aaradhana
Aathmadheepamu – Veliginchinaavu – Neeke Aaradhana || Amarudavu ||
Song Credits
Vocals: Pastor Ramesh Garu
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Amarudavu Neevu Naa Yesayya Song on Keyboard
Track Music
Amarudavu Neevu Naa Yesayya Track Music
Ringtone Download
Amarudavu Neevu Naa Yesayya Ringtone Download
Mp3 Song Download
Amarudavu Neevu Naa Yesayya Mp3 Song Download
More Hosanna Songs
Click Here for more Hosanna Ministry Songs