శ్రీకరుడా నా యేసయ్యా | Sree Karuda Yesayya Song Lyrics

Telugu Lyrics

Sree Karuda Yesayya Song Lyrics in Telugu

కృపా కృపా సజీవులతో నను నిలిపినది నీ కృపా (2)

నా శ్రమదినమున నాతో నిలిచి – నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప (2)

కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా


1. శాశ్వతమైన నీ ప్రేమతో – నను ప్రేమించిన శ్రీకరుడా –

నమ్మకమైన నీ సాక్షినై నే – నీ దివ్యసన్నిధిలో నన్నొదిగిపోనీ (2)

నీ ఉపదేశమే నాలో ఫలభరితమై – నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే (2)

నీ మహిమను ప్రకటింప నను నిలిపెనే        || కృపా కృపా ||


2.  గాలితుఫానుల అలజడిలో – గూడు చెదిరిన గువ్వవలె –

గమ్యమును చూపే నిను వేడుకొనగా – నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి (2)

నీ వాత్సల్యమే నవ వసంతము – నా జీవిత దినములు ఆద్యంతము  (2)

ఒక క్షణమైనా విడువని ప్రేమామృతము      || కృపా కృపా ||


3. అత్యున్నతమైన కృపలతో – ఆత్మఫలముల సంపదతో –

అతిశ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది – నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ (2)

నా హృదయార్పణ నిను మురిపించని – నీ గుణాతిశయములను కీర్తించని (2)

ఈ నిరీక్షణ నాలో నెరవేరని         || కృపా కృపా ||

English Lyrics

Sree Karuda Yesayya Song Lyrics in English

Krupa krupa Sajeevulatho Nanu Nilipinadhi Nee Krupaa (2)

Naa Sramadhinamuna Naatho Nilichi – Nanu Oodharchina Navyakrupa Needhu Krupa  (2)

Krupaa Sagara Mahonnathamaina Nee Krupa Chalunayaa


1.Saaswathamaina Nee Prematho – Nanu Preminchina Sreekarudaa –

Nammakamaina Nee Saakshinai Ne – Nee Dhivya Sannidhilo Nannodhigiponee  (2)

Nee Upadhesame Nalo Phalabharithamai – Nee Kamaneeya Kanthulanu Virajimmene  (2)

Nee Mahimanu Prakatimpa Nanu Nilipene     || Krupa Krupa ||


2. Galithuphanula Alajadilo – Goodu Chedharina Guvvavae –

Gamyamu Choope  Ninu Vedukonagaa – Nee Prema Kaugililo Nannadharinchithivi  (2)

Nee Vaathsalyame Nava Vasanthamu – Naa Jeevitha Dhinamulu Aadhyanthamu  (2)

Oka Kshanamainaa Viduvani Premaamrutham     || Krupa Krupa ||


3. Athyunnathamaina Krupalatho – Aathmaphalamula Sampadhatho –

Athisreshtamaina Swasthyamunu Pondhi – Nee Prema Rajyamulo Harshinchuvela (2)

Naa Hrudhayarpana Ninu Muripinchani – Nee Gunathisayamulanu Keerthinchanee (2)

Ee Nireekshana Nalo Neraverani        || Krupa Krupa ||

Song Credits

Vocals: Pastor Ramesh Garu

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Sree Karuda Yesayya Song Lyrics

Track Music

Sree Karuda Yesayya Track Music

Ringtone Download

Sree Karuda Yesayya Ringtone Download

Mp3 Song Download

Sree Karuda Yesayya Mp3 Song Download

More Hosanna Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro