ఆకాశ వీధుల్లో ఆనందం | Aakasa Veedhullo Anandam Song Lyrics

ఆకాశ వీధుల్లో ఆనందం | Aakasa Veedhullo Anandam Song Lyrics || Joshua Shaik Latest Telugu Christian Song

Telugu Lyrics

Aakasa Veedhullo Anandam Lyrics in Telugu

ఆకాశ వీధుల్లో ఆనందం – ఆ నింగి తారల్లో ఉల్లాసం 

ఈ రేయి వెన్నెల్లో సంతోషం – ఇల పొంగేను లోలోన సంగీతం

లోకాలకే రారాజుగా – యేసయ్య పుట్టాడుగా …హేహెయ్

లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య

దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యా

ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక

మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక

సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె    || లోకాలనేలే ||


1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ

దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ

చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే

వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే

సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించె    || లోకాలనేలే ||

అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం 

సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం

2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను

పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను

వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో

అంతులేని చింతలేని పరమునే పొందుకో

సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె    || లోకాలనేలే ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

LYRICS & PRODUCER: Joshua Shaik

MUSIC: Pranam Kamlakhar

VOCALS: Javed Ali, Anwesshaa

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christian Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro