నే మారిపోయినా | Ne Maripoyina Song Lyrics

Telugu Lyrics

Ne Maripoyina Song Lyrics in Telugu

నే మారిపోయినా నీవు మారనన్నావు – నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు (2)

ఇది ఏమి బంధమో – నీ ప్రేమ అనుబంధం (2)

వర్ణించలేను నీ ప్రేమను – వివరించలేను నీ ప్రేమను  || నే మారిపోయినా ||


1. నేనెంత వద్దన్నా నా వెంటపడ్డావు – వెంటాడి వెంటాడి నీ వైపు తిప్పావు (2)

నేను మాట్లాడుకున్నా నాతోనే మాట్లాడి (2)

నా మదిని గెలిచావు – నా దైవమైనావు

నా మదిని నిలిచావు – నా దైవమైనావు   || నే మారిపోయినా ||


2. నాలో ఏమి లేకున్నా ఏరి కోరుకున్నావు  – నేనేమి కాకున్నా నా ప్రాణమన్నావు (2)

నే నిన్ను యెరుగకున్నా – నువ్వు నన్ను ఎరిగావు (2)

నా హృదిలో నిలిచావు – నా తండ్రివైనావు 

నా మదిలో నిలిచావు – నా తండ్రివైనావు   || నే మారిపోయినా ||


3. నేనేమి అడగకున్నా నాకన్ని ఇచ్చావు – ఆశ్చర్యకార్యములెన్నో నాపట్ల చేశావు (2)

ఊహించలేనంత ఉన్నతముగా ఉంచావు (2)

నన్ను నీకొరకే అర్పించుకున్నావు (2)   || నే మారిపోయినా ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Tune by: Sharon Praveen

Music composer: Linus

Vocals: Akshaya Praveen

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro