అదిగో ప్రియుని కేక | Aadigo Priyuni Keka Song Lyrics

Telugu Lyrics

Aadigo Priyuni Keka Song Lyrics in Telugu

అదిగో ప్రియుని కేక  నీకై యేసు రాక (2)

వెదుకుతు ఉన్నావా విడుదల దారే కనరాక – పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాక (2) || అదిగో ||


1. అడుగడుగున పయనములో – అవమానపు హేళనలో – నొప్పించే మాటలతో – మనసు నలిగి ఉన్నావా (2)

మదినిండిన వేదనను – మౌనముగా భరియిస్తూ

కనుల నిండ కన్నీళ్ళతో – ప్రభుని చూస్తు ఉన్నావా

నువ్వు నమ్మినా దేవుడు – నిన్ను మరచి పోడెన్నడు

అనుభవాల పాఠం కోసం – నిన్ను అప్పగించాడు

పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే – సమయం సంతోషం ఇక ఆసన్నమాయే (2) || వెదుకుతు ఉన్నావా ||


2. ప్రాణహితులు అన్నవారే – ప్రాకారం కూల్చివేయగా – అనురాగం చిన్నబోయి – మిన్నకుండిపోయావా (2)

నీ ప్రేమే విషమయ్యి – నీ మమతే మిష అయ్యి

నువ్వు ఆనుకున్న వారే – నిన్ను త్రోసివేసారా

నీవు చేసినా మేలు – నీ దేవుడు చూసాడు

నీవు పొందినా కీడు – నిశ్చయముగ రాశాడు

న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు- నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు (2) || వెదుకుతు ఉన్నావా ||

English Lyrics

Aadigo Priyuni Keka song Lyrics in English

Adigo Priyuni Keka Nekai Yesu Raaka (2)

Vedhukuthu Unnavaa Vidhudhala Dhaare Kanaraaka – Pondhe Ee Sramalu Netho Undavu Kadhadhaaka (2)  

|| Adhigo ||


1.Adugaduguna Payanamulo – Avamaanapu Helanalo – Noppinche Maatalatho – Manasu Naligi Unnava (2)

Madhinindina Vedhananu – Maunamugaa Bhariyisthu..

Kanula Ninda Kanneellatho – Prabhuni Choosthu Unnavaa

Nuvvu Namminaa Dhevudu – Ninnu Marachi Podennadu

Anubhavaala Paatam Kosam – Ninnu Appaginchadu

Pondhe Prathi Gaayam Roopumasipoye – Samayam Santhosham Ika Aasannamaaye (2)

|| Vedhukuthu Unnava ||


2.Pranahithulu Annavaare – Praakaram Koolchiveyagaa –

Anuragam Chinnaboyi – Minnakundipoyava (2)

Nee Preme Vishamayyi – Nee Mamathe Misha Ayyi

Nuvvu Aanukunnavaare – Ninnu Throsivesaaraa

Neevu Chesinaa Melu – Nee Dhevudu Choosadu

Neevu Pondhinaa Keedu – Nischayamuga Raasadu

Nyayam Anyayam Thelisi Unnavadu – Nee Neethe Sooryakaanthai Veluga Niluputhadu (2)

|| Vedhukuthu Unnava ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Aadigo Priyuni Keka Song Lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro