ఆ రాత్రిలో  నింగిలో ఒక తార | Aa Raatrilo Ningilo Oka Tara Song Lyrics

ఆ రాత్రిలో  నింగిలో ఒక తార | Aa Raatrilo Ningilo Oka Tara Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Aa Raatrilo Ningilo Oka Tara lyrics in Telugu

రాత్రిలో  నింగిలో ఒక తార  – గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి  (2)

జ్ఞానులు కనుగొనిరి ఓర్పుతో ఆ తారను వెంబడించి చేరెను బేత్లెహేముకు || ఆ రాత్రిలో ||


1. ఆ కాలములో ఉన్న జ్ఞానులు – ఖగోళ వింతను వీక్షించిరి  (2)

 ఏదో జరిగెనని ఈ లోకంలో – అన్వేషించుచు చేరెను బెత్లేహెం (2)

 యూదుల రాజైన  యేసుక్రీస్తును – దర్శించి పూజించి ఆరాధించిరి

 బంగారం సాంబ్రాణి బోళమునర్పించిరి  || ఆ రాత్రిలో ||


2. ఆ కాలములో ఉన్న గొల్లలు – రాత్రిజామున మందను కాయుచుండగా   (2)

 దేవుని దూతోకటి తెలిపెను శుభవార్త – రక్షకుడేసుని చూచిరి గొల్లలు  (2)

 లోక రక్షకుడు యేసు క్రీస్తును- కనులారా వీక్షించి సంతోషించిరి

 చూచినవి అందరికి చాటించిరి  || ఆ రాత్రిలో ||


3. ఆ కాలములో దూత గణములు – పరలోకమునుండి భువికేతెంచుచు   (2)

సర్వోన్నతమైన స్థలములలో నేడు – దేవునికి మహిమ కలుగును గాక  (2)

ఆయనకిష్టులైన మనుష్యులకు భువిపై – సమాధానము అనుచు దూతలు పాడిరి

గొర్రెల కాపరులు త్వరపడి వెళ్లిరి – బేత్లెహేము గ్రామములో – పశువుల పాకలో  

కనులారా బాలుడను –  చూచిరి గొల్లలు   || ఆ రాత్రిలో ||

Song Credits

Lyrics,Tune & Produced – MEDIDI. PRASANNA KUMAR

Music – JK CHRISTOPHER

Vocals & Video Edit – LILLYAN CHRISTOPHER

Music Programming – JK CHRISTOPHER, SURESH & BOBBY MSJ

Ryhthms – ISSAC

Flute – YUGANDER

Bass Guitar – MARVIN

Acoustic & Classical Guitar – SUNNY RAJ ANANTHARAPU

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro