వెలిగింది ఒక తార నింగిలో | Veligindhi Oka Thara Ningilo Song Lyrics

వెలిగింది ఒక తార నింగిలో | Veligindhi Oka Thara Ningilo Song Lyrics || Telugu Christmas Song by AAG Team Works

Telugu Lyrics

Veligindhi Oka Thara Ningilo Lyrics in Telugu

వెలిగింది ఒక తార నింగిలో – క్రీస్తుయేసు జనన వార్త తెలుపను

వెలగాలి నీవు ఈ లోకంలో – క్రీస్తు ప్రేమను రుచిచూపేలా (2)

యేసే రక్షకుడని క్రీస్తే అబిషక్తుడని – తోడైయుండే దేవుడని ప్రకటించాలి

ఆశ్చర్యకరుడని బలమైన దేవుడని – ఆలోచన కర్తని ఆరాధించాలి

అను పల్లవి:

సర్వోన్నతమైన స్థలములలోనా – దేవునికే మహిమ కలుగునుగాక (2)   || వెలిగింది ||


1. నసించుచున్న దానిని రక్షించుటకు – దేవుడే దిగొచ్చినాడుగా

అంధకారమందు వెలుగు నింపుటకొరకు – నీతిసూర్యుడు ఉదయించెనుగా (2)

క్రీస్తును దరియించినా వారందరు – ధరణిలో వెలగాలిగా

నీతిమార్గమందు అనేకులను చేర్చగా – తార వలె వెలగాలిగా

యేసే దేవుడని ఆయనే సజీవుడని – పాప విమోచకుడని ప్రకటించాలి

అన్ని నామములకన్న పైనామమేసని – ప్రభువైన క్రీస్తును ఆరాధించాలి

సర్వోన్నతమైన స్థలములలోనా – దేవునికే మహిమ కలుగునుగాక (2)   || వెలిగింది ||


2. పరలోకమేలుచున్న మహా రాజైనను – రిక్తునిగా అరుదెంచెనుగా

సర్వ మానవాళిని రక్షించుటకు – తన ప్రాణమర్పించెనుగా (2)

క్రీస్తును నమ్మి వెంబడించువారు – సత్ క్రియలతో వెలగాలిగా

నరకాగ్నినుండి అనేకులను రక్షింప – సువార్తను ప్రకటించాలిగా

యేసే సత్యము యేసే జీవము – పరలోక మార్గమని ప్రకటించాలి

పరిపూర్ణుడేసని పరిశుద్ద దేవుడని – నీతి సూర్యుడేసని ఆరాధించాలి

సర్వోన్నతమైన స్థలములలోనా – దేవునికే మహిమ కలుగునుగాక (2)   || వెలిగింది ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, mix & mastering: Ps. V. Satyam

Music: Danuen Nissi

Rhythms: Kishore Immanuel

Vocals: Satyam, Enosh Paul, Manasa & Keerthana

VFX: P. Vijay

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro