సూడ సక్కనోడమ్మా వెలసినాడోయమ్మా | Sooda Sakkanodamma Song Lyrics

సూడ సక్కనోడమ్మా వెలసినాడోయమ్మా | Sooda Sakkanodamma Song Lyrics || 2023 Telugu Christmas Song

Telugu Lyrics

Sooda Sakkanodamma Song Lyrics in Telugu

సూడ సక్కనోడమ్మా వెలసినాడోయమ్మా – బెత్లహేము ఊరిలోన పశుల పాకలోన

నీతిమంతుడోయమ్మా పరిశుద్ధుడోయమ్మా – కన్య మరియ గర్భమందు పుట్టినాడోయమ్మా (2)

జగమంతా సంబరమే యేసయ్య పుట్టాడని – మనసంతా ఉల్లాసమే రక్షింప వచ్చాడని

సంతోషించి ఆనందించి స్తుతులర్పించెదం (2)

ఆనందం ఎంతో ఆనందం – ఆహా ఎంతో ఎంతో ఆనందం

సంతోషం ఎంతో సంతోషం – మన గుండెల నిండా సంతోషం (2)    || సూడ సక్కనోడమ్మా ||


1. మలినమైన వారిపైన ఎంత గొప్ప సంకల్పం – మాట వినని వారిపైన ఎంతో గొప్ప వాత్సల్యం (2)

ఉన్నత మహిమను విడిచినాడమ్మో – శాశ్వత కృపను సూపినాడమ్మో (2)

లోక రక్షకునిగా ఉదయించినాడమ్మో  (2)

ఆనందం ఎంతో ఆనందం – ఆహా ఎంతో ఎంతో ఆనందం

సంతోషం ఎంతో సంతోషం – మన గుండెల నిండా సంతోషం (2)    || సూడ సక్కనోడమ్మా ||


2. పాపాలన్నీ బాపివేసే ఒకే ఒక్క దేవుడమ్మ – పాపాన్నే ఎరుగని నిజ దేవుడేసెనమ్మా (2)

నిన్ను నన్ను ప్రేమించే ప్రేమామయుడమ్మా – నీదు పాపమొప్పుకుంటే రక్షిస్తాడోయమ్మా (2)

పరలోక మిచ్చుటకే ఇలా పుట్టినాడమ్మా (2)

ఆనందం ఎంతో ఆనందం – ఆహా ఎంతో ఎంతో ఆనందం

సంతోషం ఎంతో సంతోషం – మన గుండెల నిండా సంతోషం (2)    || సూడ సక్కనోడమ్మా ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics Tune: -Bro Sunith & Bobby Jeevan

Vocals: – Bro.Joshua Gariki &Tinnu Thereesh

Music: Sudhakar Rella

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro