కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ | Koniyada Tharame Ninnu Lyrics || Andhra Kraisthava Keerthanalu
Telugu Lyrics
Koniyada Tharame Ninnu Song Lyrics in Telugu
కొనియాడ తరమే నిన్ను – కోమల హృదయ
కొనియాడ తరమే నిన్ను
తనరారు దినకరు – బెను తారలను మించు (2)
ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు || కొనియాడ ||
1. కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2)
నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు || కొనియాడ ||
2. సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2)
నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు || కొనియాడ ||
3. విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2)
పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు || కొనియాడ ||
4. దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2)
యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు || కొనియాడ ||
5. నరులయందున కరుణ – ధర సమాధానంబు (2)
చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు || కొనియాడ ||
6. ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2)
శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత || కొనియాడ ||
English Lyrics
Koniyada Tharame Ninnu Song Lyrics in English
Koniyada Tharame Ninnu Komala Hrudhaya
Koniyaada Tharame Ninnu
Thanaraaru Dhinakaru – Benu Thaaralanu Minchu (2)
Ghana Thejamuna Noppu – Kaanthimanthuda Veevu || Koniyada ||
1. Kherubulu Serupulu – Mari Dhootha Ganamulu (2)
Nurutharambuga Goluva – Noppu Shreshtuda Veevu || Koniyada ||
2. Sarva Lokambula – Barvu Dhevuda Vayyu (2)
Nurvi Sthree Garbhaana – Nudbhavinchithi Veevu || Koniyada ||
3. Vishwamanthayu Nelu – Veeraasanuda Vayyu (2)
Pashvaalitho Dhotti – Pandiyuntivi Veevu || Koniyaada ||
4. Dhosambulanu Madiyu – Dhaasaali Karuninchi (2)
Yesu Peruna Jagathi – Kegudenchithi Neevu || Koniyada ||
5. Narulayanduna Karuna – Dhara Samaadhaanambu (2)
Chirakaalamunu Mahima – Paraga Jeyudu Veevu || Koniyada ||
6. Oh Yesu Paanpuga – Naa Yaathma Jekoni (2)
Sreyamuga Pavalinchu – Sreekara Varasutha || Koniyada ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Written By: Panthagani Paradesi
Vocals: Sudha, Revathy
Music: Pranam Kamlakhar
Album: Thrahimam 2 (2013)
Ringtone Download
Koniyada Tharame Ninnu Ringtone Download
Track Music
Koniyada Tharame Ninnu Track Music
More Andhra Kraisthava Keerthanalu
Click Here for more Andhra Kraisthava Keerthanalu