చూచుచున్నాము నీ వైపు | Chuchu Chunnamu Nee Vaipu

చూచుచున్నాము నీ వైపు | Chuchu Chunnamu Nee Vaipu || Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Chuchu Chunnamu Nee Vaipu Song Lyrics in Telugu

చూచుచున్నాము నీ వైపు – మా ప్రియ జనక (2)

చూచుచున్నాము నీ వైపు

చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను (2)

జాచుచు గరములు – చక్కగా నీవైపు (2)    || చూచుచున్నాము ||


1. మేమరులమై యుంటిమి

మార్గము వీడి – మేమందరము పోతిమి (2)

ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి (2)

క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి (2)       || చూచుచున్నాము ||


2. నిను నమ్ము పాపులకు

వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు (2)

ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు (2)

గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప (2)       || చూచుచున్నాము ||


3. నీ భయము మాయెదలను

నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను (2)

నీ భయముచే మేము – వైభవ మొందుచు (2)

నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు (2)       || చూచుచున్నాము ||


4. దయ జూచి మము నెప్పుడు

మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు (2)

దయచేయరానివి – దయచేయుమని కోర (2)

దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి (2) || చూచుచున్నాము ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro