శకపురుషుడు | Shaka Purushudu Song Lyrics

శకపురుషుడు | Shaka Purushudu Song Lyrics || Telugu Christmas Song Sung by Pastor John Wesley Garu (Hosanna Ministries)

Telugu Lyrics

Shaka Purushudu Song Lyrics in Telugu

వచ్చాడు మహారాజు మరి మనకోసమే అండగా తోడుగా

శకపురుషుడు మహిమాన్వితుడు – మా రారాజతడు…. (2) ఓహో…

అను పల్లవి: –

వేవేల దూతల స్తుతులతో – నిత్యము కొనియాడబడుచు

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని – నిత్యము కీర్తించబడుచు

మహిమాన్వితుడు మహనీయుడు – మారని నిజదేవుడు

మన కోసమే మహిమని విడచి – భువికే రక్షణ తెచ్చాడు     || వచ్చాడు ||


1. మాటతోనే సృష్టిని చేసిన ఎంతో గొప్ప దేవుడు

మంటితోనే మనిషిని చేసిన ఎంతో మహనీయుడవు (2)

తన స్వహస్తాలతో తన స్వాస్థ్యముగా (2)

మము కాచి పెంచి ప్రేమిస్తున్న ఏకైక దేవుడు     || వచ్చాడు ||


2. నరులను ప్రేమించి పరమును విడచి మనిషిగా పుట్టినాడు

మరణము గెలిచి రక్షణనిచ్చి మార్గము చూపినాడు (2)

నీ హృదయము కోరాడు – మరి ఏమి అడుగలేదు (2)

మారుమనస్సు పొంది మనము మోక్షమే చేరెదము      || వచ్చాడు ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Sangeetha Rao

Music: Bobby Karra

Vocals: Pas. John Wesley Garu (Hosanna Ministries)

Mixed and mastered by: Dani Louis

Edit and Vfx: Hallaluya Raju

Title design: Sathish

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro