సంవత్సరాది మొదలుకొని | Samvatsraadi Modalukoni Song Lyrics

సంవత్సరాది మొదలుకొని | Samvatsraadi Modalukoni Song Lyrics || Telugu Christian New Year Song

Telugu Lyrics

Samvatsraadi Modalukoni Song Lyrics in Telugu

సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కాచావు (2)

కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి (2)

కాచావు, భద్రపరిచావు – కృపచూపావు, వందనం

కాచావు, భద్రపరిచావు – బ్రతికించావు, వందనం…

(అ.ప) నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే – నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే… (2)


1. కన్నీళ్లలో కష్టాలలో – కడగండ్లలో కృంగిన వేళలో (2)

ఆదరించావు చెంత నిలిచావు – ఆదుకున్నావు కన్నీరు తుడిచావు

నన్ను ఆదరించావు నా చెంత నిలిచావు – ఆదుకున్నావు కన్నీరు తుడిచావు  || నీవే లేక ||


2. ఆరోగ్యమే క్షీణించగా – ఆవేదనే ఆవరించగా (2)

స్వస్థపరిచావు శక్తినిచ్చావు – లేవనెత్తావు ఆయుష్షు పెంచావు

నన్ను స్వస్థపరిచావు నీ శక్తినిచ్చావు – లేవనెత్తావు ఆయుష్షు పెంచావు || నీవే లేక ||


3. సంవత్సరములు జరుగుచుండా – నీ కార్యములు నూతనపరచుము (2)

 మహాకార్యములను జరిగించుము – మహాభీకరుండ మహిమరాజా (2)   || నీవే లేక ||


4. ప్రభువా దేవా ఈ జీవితం – నీ పాదసేవకే ఇల అంకితం (2)

సమాధానవార్తను ప్రకటింతును – భీకరకార్యములను జరిగింతును (2)  || నీవే లేక ||

Song Credits

Lyrics & Tune: Pastor Daniel Raj

Producer: Pastor Isaac

Music: Moses Dany

Vocals: Dr. Honey

Tabla & Dolak: Kiran

Violin: Balaji

Flute: Lalith

Shehnai: Padmashree Pandit Balesh

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More New Year Songs

Click Here for more Telugu Christian New Year Songs

Leave a comment

You Cannot Copy My Content Bro