Pastor David Parla’s Testimony (Oneness Song Producer)

Testimony

డేవిడ్ పార్ల గారు చిన్నప్పటి నుండే కొంచెం అల్లరి గా ఉండేవారు.  వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు సేవకులు. ఈయన చిన్నప్పటి నుండి అల్లరిగా ఉండడంతో డేవిడ్ గారి తాత గారు  ఆయనతో పాటు పరిచర్యకు తీసుకెళ్లేవారు.

ఆలా తాతతో పాటు పరిచర్యలో మరియు వారి తాత లెక్క ఉదయం 4 గంటలకు ప్రార్ధించడం చేసేవాడు.

మెల్ల మెల్లగా వయసుకు వచ్చే సరికి ఆయనకు అన్ని చెడ్డ అలవాట్లు   అబ్బాయి. చెడు వ్యసనాలకు అలవాటయ్యి ఫ్రెండ్స్ తో కలిసి తిరగడం, త్రాగడం అర్ధ రాత్రి 1 కి అలా ఇంటికి వచ్చేవాడు.

ఆ సమయంలో కూడా వాళ్ళ తల్లి వచ్చి అతని కాలకాడ మోకాళ్లూని ఏడుస్తూ ప్రార్ధన చేస్తూ ఉండేది. డేవిడ్ గారి అలవాట్లు, కొట్టుకోవడం, అల్లర్లు చూసిన ఈయన తండ్రి ఒకానొక పరిస్థితిలో నువ్వు చనిపోయిన 4 రోజులు బాధపడి తర్వాత సంతోషం గా ఉంటాం. నీ వాళ్ళ మనశాంతి లేకుండా పోయింది అని చెప్పడం జరిగింది. 

వాళ్ళ తండ్రి కాలుపెట్టుకొని నువ్వు చనిపోయిన బాగుండు అని అడగడంతో ఆయనకు ఏం చెయ్యాలో తెలియక  గెస్ట్ హౌస్ కి వెళ్లి తన ఫోన్ నోకియా 1100 ని తనకు ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యకుండా ఉండాలని switch off చేసుకొని తాను విషం తాగి చనిపోవాలి అని అనుకున్నాడు.

Pastor David Parla Testimony (Oneness Song Director and Producer)

ఆరోజు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కానీ తనకు ఫోన్ కాల్ వచ్చింది తాను లిఫ్ట్ చెయ్యగానే కలకత్తా నుండి ఒక దైవజనుడు నువ్వు ఆత్మహత్య చేసుకోబోతున్నావ్ కదా అని తనని అడిగాడు.

తాను నీకే మా అమ్మ కానీ మా నాన్న కానీ చెప్పారా అని అడిగితే అయన నువ్వు వాళ్ళకి చెప్పవా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అని అడిగాడు.

అయన లేదు అని చెప్తే ఆ పాస్టర్ గారు అవిధేయులుగా తిరుగుతున్న తన బిడ్డలకోసం 40 రోజులు ఉపవాసం ఉంది ప్రార్ధన చేయుచుండగా 40 వ రోజు ఆయనకు దేవుడు ఫోన్ నంబర్స్ చెప్తే ఆ నంబర్స్ తో కాల్ చెయ్యగా అది సూసైడ్ చేసుకోబోతున్న డేవిడ్ గారికి రింగ్ అయ్యింది.

పాస్టర్ గారు నీవు చనిపోవద్దు నీ కోసం దేవుని ప్రణాళిక ఉంది అని చెప్పగా అయన విరమించుకున్నారు.

అలాగే 2 వ సారి అయన సింగపూర్ లో బైబిల్ ట్రైనింగ్ తీసుకొనుచుండగా అక్కడికి ప్రాఫిట్ ఎడ్వర్డ్ బుషిరి వచ్చారు. అయన డేవిడ్ గారి పూర్తి పేరుతో పిలిచి దేవుడు పిలుపును గురించి చెప్పారు.

డేవిడ్ పార్ల గారు ఇప్పటికి 10 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నారు.

ఇప్పడు ఎవరైనా యువకులు అయన దగ్గరికి వస్తే వారికి చెప్పడానికి తన సాక్ష్యం చాల ఉపయోగపడుతుందని చెప్పారు.

Leave a comment

You Cannot Copy My Content Bro