నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా | Nee Paadha Sannidhiki Song Lyrics

నీ పాద సన్నిధికి | Nee Paadha Sannidhiki Song Lyrics || Songs of Zion

Telugu Lyrics

Nee Paadha Sannidhiki Lyrics in Telugu

నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా

నీ ప్రేమ కనుగొనుచు – దేవా నే వచ్చితిని (2)


1. విశ్రాంతి నిచ్చెడు దేవా – శ్రమలెల్ల తీర్చుమయ్యా (2)

సిలువయే నా ఆశ్రయము – హాయిగా నచటుండెదను (2)    || నీ పాద ||


2. సీయోను మూలరాయి – అయ్యున్న ఓ ప్రభువా (2)

కలతను చెందక నేను – నీకై కనిపెట్టెదను (2)   || నీ పాద ||


3. ప్రార్థించుమంటివి ప్రభువా – సంకట సమయములో (2)

దయచూపి నను కరుణించి – ప్రేమతో ఆదరించుమయ్యా (2)   || నీ పాద ||


4. నరమాత్రుడవు నీవు కావు – మొఱ నాలకించుము (2)

మనస్సార ప్రార్థించుచు – యేసు నీదరి చేరెదను (2)   || నీ పాద ||


5. విశ్రాంతి నిచ్చెడు దేవా – శ్రమలెల్ల తీర్చుమయ్యా (2)

సిలువయే నా ఆశ్రయము – హాయిగా నచటుండెదను (2)     || నీ పాద ||


6. నన్ను చేయి విడువకు నాథా – నిందలెన్నో పొందినను (2)

నీకై సహించెదనంత – నీ బలము నా కిమ్ము (2)    || నీ పాద ||


7. ఆశతో నీ ముఖమును నేను – ఆసక్తితో చూడ (2)

సిగ్గుపడనుగా నేను – నీ ప్రకాశము నాపై నుండ (2)    || నీ పాద ||


8. శత్రువు నోడించుటకు – నీ శక్తిని చూపు (2)

నన్నాదరించి నీవు – ఆవరించి కాపాడుము (2)    || నీ పాద ||


9. జీవించి ఎదుగునట్లు – జయ జీవితంబిమ్ము (2)

ఫలించి వర్థిల్లుతకై – ప్రభువా నీ కృప నిమ్ము (2)    || నీ పాద ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Vocals: Mrs. Blessie Wesly

Music: John Pradeep

More Comfort Songs

Click Here for more Telugu Christian Comfort Songs

Leave a comment

You Cannot Copy My Content Bro