జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే | Jayahe Jayahe Song Lyrics

Telugu Lyrics

Jayahe Jayahe Song Lyrics in Telugu

జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే – జయహే జయహే రారాజు ప్రభుకు జయహే  (2)

నరులను చేసిన దేవునికి జయహే జయహే – మరణము గెలిచిన ధీరునికి జయహే జయహే

త్రిత్వ దేవునికి జయహే – తండ్రి దేవునికి జయహే…  

ఆత్మనాధునకు జయహే – మన అన్న యేసునకు జయహే జయహే (జయహే జయహే)


1. తన మాటతో ఈ సృష్టిని చేసిన దేవునికి జయహే – తన రూపులో మానవులను సృజించిన ప్రభువునకు జయహే  (2)

ఆది అంతముకు జయహే – అద్వితీయునకు జయహే…

అత్యున్నతునకు జయహే… అనాది దేవునకు జయహే జయహే (జయహే జయహే)


2. దహియించెడి మహిమాగ్నితో వసియించెడి రాజునకు జయహే

పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు పొగడే ప్రభుకు జయహే  (2)

అగ్ని నేత్రునకు జయహే – ఆత్మరూపునకు జయహే…

అమరత్వునకు జయహే… అనంత దేవునికి జయహే జయహే  (జయహే జయహే)


3. తన రక్తమున్ మానవులకై కార్చిన యేసునకు జయహే

తన బలముతో మరణంబును జయించిన వీరునికి జయహే  (2)

సిల్వ దారునకు జయహే – త్యాగశీలునకు జయహే …

మరణ విజయునకు జయహే … జీవించు దేవునకు జయహే జయహే (జయహే జయహే)


4. తన మహిమతో మేఘాలపై వచ్చెడి యేసునకు జయహే

తానుండెడి స్థలమందున మనలను ఉంచడి ప్రభుకు జయహే  (2)

న్యాయతీర్పరికి జయహే సర్వశక్తునకు జయహే

సర్వోన్నతునకు జయహే – సైన్యముల అధిపతికి జయహే జయహే (జయహే జయహే)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Jayahe Jayahe Song Track

MP3 song Download

Jayahe Jayahe MP3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro