దేవుని ప్రేమ ఇదిగో | Devuni Prema Idigo Lyrics

దేవుని ప్రేమ ఇదిగో | Devuni Prema Idigo Lyrics || Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Devuni PremaIdigo Lyrics in Telugu

దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునన్ దెలియరే

కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును (2)     || దేవుని ||


1. సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను

సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను         || దేవుని ||


2. మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను

మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే     || దేవుని ||


3. యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల

దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు     || దేవుని ||


4. పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి

పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను      || దేవుని ||


5. సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను

సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను      || దేవుని ||


6. చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను

సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి      || దేవుని ||


7. గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే

మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను     || దేవుని ||


8. చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను

పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్       || దేవుని ||


9. ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి

వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు      || దేవుని ||


10. ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను

మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను     || దేవుని ||


11. రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్

రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను     || దేవుని ||


12. రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును

పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా      || దేవుని ||


13. మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు

నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్      || దేవుని ||


14. పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు

పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను     || దేవుని ||


15. నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును

నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను         || దేవుని ||

English Lyrics

Devuni Prema Idigo Lyrics in English

Devuni Prema Idigo – Janulaara – Bhaavambunam Dheliyare

Kevalamu Nammukonina – Paraloka – Jeevambu Manakabbunu      || Devuni ||


1. Sarvalokamu Manalanu – Thana Vaakya – Sathyambutho Jesenu

Sarvopakaarudunde – Mana Meedha – Jaaliparudai Yundenu      || Devuni ||


2. Maanavula Rakshimpanu – Dhevundu – Thana Kumaaruni Bampenu

Mana Shareeramu Dhaalchenu – Aa Prabhuvu – Mana Paapamunaku Dhoorude      || Devuni ||


3. Yesu Kreesthanu Peruna – Rakshakudu – Velasi Naadilalopala

Dhosakaari Janulatho – Nentho -Su Bhaashalanu Balkinaadu      || Devuni ||


4. Paapa Bhaarambu Thoda – Ne Proddu – Prayaasamula Bondhedi

Paapulandharu Nammina – Visraanthi – Paripoornamitthu Nanenu      || Devuni ||


5. Sathulaina Purushulainan – Yaa Kartha – Sarva Janula Yedalanu

Sathpremaga Nadichenu – Paraloka – Sadhbodhalika Jesenu      || Devuni ||


6. Chaavu Nondina Kondharin – Yesundu – Chakkagaa Brathikinchenu

Sakala Vyaadhula Rogulu – Prabhu Nanti – Swasthambu Thaa Mondhiri      || Devuni ||


7. Gaali Sandhrapu Pongulan – Saddhanipi – Neellapai Nadachinaade

Melu Gala Yadbhuthamulu – Eelaagu – Vela Koladhiga Jesenu      || Devuni ||


8. Chethula Kaallalonu – Raa Raaju – Chera Mekulu Bondhenu

Paathakulu Gottinaare – Parishuddha – Neethi Thaa Morvalekan      || Devuni ||


9. Odulu Rakthamu Gaaraga – Dhebbalu – Chedugu Landharu Gottiri

Vadimullu Thala Meedhanu – Bettiri – Orcheno Rakshakundu      || Devuni ||


10. Inni Baadhalu Bettuchu – Dhanu Jampu – Chunna Paapa Narulanu

Manninchu Mani Thandrini – Yesundu – Sannuthitho Vedenu      || Devuni ||


11. Rakshakudu Srama Bondhagaa – Dheshambu – Thakshanamu Cheekatayyen

Rakshakudu Mruthi Nondhaga – Thera Chinigi – Raathi Kondalu Pagilenu      || Devuni ||


12. Raathi Samaadhilonu – Rakshakuni – Neethigala Dhehambunu

Paathi Pettiri Bhakthulu – Nammina – Naathu Landharu Joodagaa      || Devuni ||


13. Moodava Dinamandhuna – Yesundu – Mruthi Gelchi Lechinaadu

Naadu Nammina Manujulu – Choochiri – Naluvadhi Dhinamulandhun      || Devuni ||


14. Padunokandu Maarulu – Vaaralaku – Brathyakshu Daaye Nesu

Paralokamuna Kegenu – Thana Vaartha – Brakatinchu Mani Palkenu      || Devuni ||


15. Nammi Baapthismamondhu – Narulaku – Rakshana Mari Kalgunu

Namma Nollaka Poyedu – Narulaku – Narakambu Siddhamanenu      || Devuni ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: N Dasubabu

Vocals: Ezra Sastry

Ringtone Download

Devuni Prema Idigo Ringtone Download

MP3 Song Download

Devuni Prema Idigo MP3 Song Download

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro