Asher Andrew Testimony | అషేర్ ఆండ్రూ గారి సాక్ష్యం

Testimony

అషేర్ ఆండ్రూ గారి జీవిత సాక్ష్యం

అషేర్ ఆండ్రూ గారి తల్లి తండ్రులు ఇద్దరు హైందవ కుటుమ్బనుండి వచ్చిన వారే వారు దేవుని సువార్తకు లోబడి మారు మనస్సు నొంది సువార్తకు సమర్పించుకున్నారు.

అషేర్ ఆండ్రూ  గారి తల్లి గర్భిణీ గా ఉన్నప్పుడు  ఆమె ఏ బిడ్డ పుడుతుంది, బిడ్డ ఏ పని చెయ్యాలి చెయ్యాలి ఇవన్నీ దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు ఆమెతో నిర్గమ  03:12 ద్వారా మాట్లాడాడు.

“ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను”.

దీని ద్వారా దేవుడు మెగా పిల్లడు పుడతాడని అలాగే అతను దేవుడు సేవ చేస్తాడని నిశ్చయంగా చెప్పాడు.

పిల్లాడి పేరు గురించి ఆలోచిస్తుండగా  దేవుడు ఆదికాండము 49:20 ద్వారా ఆషేరు అనే పేరు పెట్టమని చెప్పాడు.

“ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును”

అయన చిన్నప్పటినుండి వాళ్ళ ఇల్లు చర్చి ఒకే క్యాంపస్ లో ఉండడం వలన ఫామిలీ ప్రేయర్స్, సేవకులతో గడపడం ఆలా దైవిక వాతావరం లో పెరిగాడు.

వాళ్ళ బెడ్ రూంలో వారి తల్లి గారు ఒక పెద్ద వాక్యం రాసి పెట్టారు అదేమనగా నిర్గమ 03:12 ” ఆయననిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను”.  

నేను నీకు తోడై ఉన్నాను ఈ పర్వతం మీద నీవు నన్ను సేవించెదవు అని రాసి ఉంటుంది వాళ్ళ బెదురూమ్ గోడమీద.

 వారి తల్లి గారు గర్భములో ఉన్నపుడే దేవుడు నీ విషయమే అది చెప్పాడు అది ఎప్పుడు గుర్తుంచుకో అనేవారు.

చిన్నప్పటినుండి సండే స్కూల్ కి వెళ్లడం, బైబిల్ పఠనం   చెయ్యడం వలన అయన మెల్లమెల్లగా దేవునికి దగ్గర అవ్వడం, దేవుడు మాట్లాడం ప్రారంభించాడు.

కానీ కొన్ని రోజులయ్యేసరికి అయన రక్షణ పొందకుండా లోకంలో ఉంటూ వచ్చారు.

Asher Andrew Testimony

అయన మారుమనస్సు పొందడానికి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.

వాళ్ళు చదువుకుంటున్న స్కూల్ పక్కనే ఒక స్మశానం ఉంది. ఒకరోజు వాళ్లకు క్లాస్ జరగడంలేదు. అయన కిటికీ పక్కన ఉండి అనుకోకుండా స్మశానంలోకి చూస్తే కొంతమంది శవాన్ని కాలుస్తున్నారు. అప్పుడు శవం ముందుకు బెండ్  అయ్యి ఎముకలు మోత అయ్యి చివరికి బూడిద అయ్యింది.

అది చూసిన తర్వాత ఆయనకు చాల భయం వేసింది. చివరకు మనిషి ఎన్ని పదవులు చేసిన ఎంత పేరు తెచ్చుకున్న ఎంత దానం సంపాదించినా చివరకు ఇలానే అవ్వాలి కదా  అని ఒకవేళ నేనేమౌతాను. అయినా నేను పాస్టర్ కొడుకుని కదా పరలోకం వెళ్తాలే అని అనుకొనే వారు.

ఒకరోజు బైబిల్ స్టడీ జరుగుతుండగా వాళ్ళ తండ్రి గరే వాక్యపరిచర్య చేస్తున్నారు. నువ్వు సేవకుడవైన, సేవకుని కొడుకువైన ఈరోజు చస్తే నువ్వెక్కడికి వెళ్తావ్ అని అన్నారు.   అప్పుడు అయన వయసు 10 సంవత్సరాలు. పరిశుద్దాత్మ దేవుడు ఆయనను గద్దిస్తున్నారు. అప్పుడు అయన తాను పశ్చాతాపం చెంది ఒప్పుకోలు ప్రార్ధన చేసారు. ఆరోజు చాల సంతోషాన్ని అనుభవించారు.

ఆయన 9వ తరగతిలో ఉన్నపుడు కొంతమంది సేవకుల వాక్యం విన్నాడు. వాళ్ళు నీ మారుమనస్సు పొందిన రోజు గుర్తులేకపోతే నీ రక్షణ రక్షణ కాదు అని, అలాగే మనసులోని ఆలోచనల పై విజయం లేదంటే నీ   రక్షణ రక్షణ కాదు అని అయినా విన్నాడు.

అయన క్రియపూర్వకం గా పాపలు చెయ్యలేదు కానీ ఈ ఆలోచనలు, అలాగే అయన స్కూల్ బస్సు లో వెళ్తున్నప్పుడు సినిమా పాటలు వినిపించేవి. ఆలా రక్షణ గురించి, సినిమా పాటలు గురించి ఆలోచన చేసి బాధపడేవాడు.  నేను చేస్తున్నది నిజమైన భక్తియేన నా రక్షణ నిజమైనదేనా అని.

ఒకసారి అయన 9వ తరగతి లో ఉన్నప్పుడు essay రైటింగ్ లో గెలిస్తే ఆయనకు గాంధీ గారి స్వీయ చరిత్ర పుస్తకం ఇచ్చారు.

దానిలో క్రైస్తవులతో నా సంబంధాలు అని ఉంది. దానిలో గాంధీ గారు క్రైస్తవులు నన్ను మార్చాలని చూసారు. వారి దేవుడు పాపం నుండి వచ్చు జీతం నుండి విముక్తి చేస్తా అన్నాడు, కానీ  అసలు పాపపు ఆలోచనలు మీద జయం కోసం చెప్పలేదు అన్నారు.

ఇదే ప్రశ్న అషేర్ గారిని కూడా వేధిస్తుంది. అయన ఒకసారి వాళ్ళ నాన్న తో కలిసి సంగారెడ్డి మీటింగ్స్ కి వెళ్తున్న సమయం లో ఈ పాయింట్ గురించి అడిగారు. అప్పుడు వారి తండ్రి    ఒకసారి ఆలోచిస్తే పర్లేదు కానీ మరల మరల దానిమీద ఆలోచనలు పెంచుకుంటే అది పాపం అవుతుంది అని చెప్పారు.

అప్పడు అషేర్ గారు నా సమస్య కూడా ఇది నేను నా రక్షణ నిజామా కాదా, నా ఆలోచనలు నేను కంట్రోల్ చెయ్యలేదుకపోతున్నాను అని చెప్తా వారి తండి “మానవునిలో పాపమూ నియమం పరిశుద్ధ నియమం అని 2 నియమాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది అంటే   అది నిజమైన రక్షణ” అని చెప్పారు.

4 సంవత్సరాలుగా ఇదే విషయం పై బాప్తిస్మము తీసుకోలేదని చెప్పడంతో రేపు బాప్తిస్మము తీసుకోవడానికి సిద్ధమా అని వారి తండ్రి అడుగగా అయన ఫారం ఫిల్ చేసి బాప్తిస్మము తీసుకున్నారు.

హస్త నిక్షేపంగా రోజు దేవుడు ఆయనకు ప్రకటన 03:08 వాక్యం ద్వారా మాట్లాడాడు.  

అయన 10వ తరగతి లో ఉన్నప్పుడు దేవునితో ఒక నియమం చేసాడు. ఇక మీదట దేవ నాకోసం కాక నీకొరకే బ్రతుకుతా అని తీర్మానం తీసుకున్నారు.

తరువుత్త అయనను దేవుడు ఇంటర్లో స్టేట్ 17వ  రాంక్ ఇచ్చారు. ఇంటర్ లో ఎం చదవాలని అని అడిగినప్పుడు రోగికి వైద్యుడు అవసరం అని   వాక్యం ద్వారా మాట్లాడారు. బైపీసీ చదివి, మల్లి MBBS చేసి చాల సంవత్సరాలు అవుతాయి ఎప్పుడు దేవుని సేవ చేస్తావు అని అయన తండ్రి అడిగినపుడు అయన డిగ్రీ లో psychiatrist సెలెక్ట్ చేసుకున్నారు. మనదేశంలోని శాస్త్రవేత్తలకు అయన ట్రైనర్ గా కూడా పని చేసారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం అప్లై చేస్తే అయనకు సీట్ వచ్చింది తర్వాత అయన సువార్త కూడికలు, translator గా చేస్తూ, యవ్వనస్థుల కూడికలు జరుపుతో ఉండగా గుడ్ ఫ్రైడే ఈస్టర్ మధ్యలో పరీక్ష వచ్చినపుడు అయన రాత్రి అంత చదివి రాసాడు. అయన రిజల్ట్స్ తర్వాత గోల్డ్ మెడలిస్టుగా సెలెక్ట్ అయ్యాడు.   PhD లో కూడా అల్ ఇండియా topper గా వచ్చాడు. PhD లో కూడా గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు.

అయన తండ్రి గారి స్నేహితుడు అషేర్ గారికి కాల్ చేసి దేవుడు నిన్ను సండే మినిస్ట్రీకి పిలుస్తున్నాడు నువ్వు చెయ్యాలి అన్నప్పుడు అయన నేనింకా చిన్నవాడిని నా వాళ్ళ కాదు అని అన్నారు. తరువాత దేవుడికి ప్రార్ధించారు ఈ అంకుల్ ఇలా అంటున్నాడు నీ చిత్తం ఏంటి అని అయన ప్రార్ధించారు.

డిసెంబర్ 31వ రోజు అయన యిర్మీయా 1:5-7,  1:17,19 ద్వారా మాట్లాడాడు.    

గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.

అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా

 యెహోవా నాకీలాగు సెలవిచ్చెను-నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్ప వలెను.

కాబట్టి నీవు నడుముకట్టు కొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును

వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.

2013 ఫిబ్రవరి 13వ తారీఖున ఆయనకు వాళ్ళ అంకుల్ ఫోన్ చేసి రేపటి సండే వర్షిప్ కి నిన్నే సెలెక్ట్ చేసారు అని అప్పుడు అయన నేను పిల్లాడిని, నాకు తెలుగు పలకడం రాదు అని చెప్పగా translate చేసే వ్యక్తిని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.

శనివారం రోజున ఎలా చెయ్యాలి అని దేవుని మాట కోసం ఆయన ప్రార్ధన చేస్తుండగా దేవుడు లూకా 19:34 ద్వారా ,మాట్లాడారు.

“అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి”.

అయన ఆ రాత్రి నేను ఎలా చెప్పాలి అని, చిన్నవాడిని, ఏమి చెప్పాలి, వాళ్ళ సమస్యలు ఏంటో నాకు తెలియదు నేను అనవసరంగా వాళ్ళ సమయాన్ని వృధా చెయ్యడం నాకు ఇష్టం లేదు నన్ను చంపెయ్.

నువ్వే నాకు సహాయం చెయ్యాలి అని అయన బాధతో ప్రార్ధన చేసాడు.

ఆరోజు ఆయన వాక్యం చెప్తుండగా దేవుడు గొప్ప పరిశుదాత్మ శక్తీ అగ్ని కుమ్మరించాడు. జనులు మేము ఏ ప్రశ్న తో వచ్చామో అదే ప్రశ్నకి జవాబు దేవుడు ఇచ్చాడు అని చెప్పారు. ఆరోజు నుండి స్పెషల్ మీటింగ్స్ కూడా వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళేవాళ్ళు.

తరువాత అయన తన పని చేసుకుంటూ తన తండ్రి అప్పగించిన ఇంగ్లీష్ వర్షిప్ సర్వీస్  ని కూడా హైదరాబాద్ లో కొనసాగిస్తూ వచ్చారు.

దానిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒక ఫ్లోర్ జనం కాస్త 2 ఫ్లోర్స్ కూడా  సరిపోని పరిస్థితి వచ్చింది.

తరువాత దేవుడు అక్కడనుండి వేరే ప్రదేశంలో చర్చి పెట్టమని ఆలా చేస్తే వెయ్యిరెట్లు ఆశీర్వదిస్తానని చెప్పారు.

తరువాత దేవుడు హైదరాబాద్ KPHB లోని Butta convention centre ని 2 సంవత్సరాలు లీజ్ తీసుకోమని చెప్పారు. ఆలా దేవుడు లైఫ్ టెంపుల్ పెట్టడానికి సహాయం చేసారు.

Asher Andrew’s Ministry

Church Name: The Life Temple

Address: Butta Convention KPHB Road, Opp Cyber Tower, Road, Madhapur, Telangana 500085

Worship Services Timings: Every Sunday Services {English Service – 7:30 AM, 1st Telugu Service – 9 AM, 2nd Telugu Service – 11 AM

Website: https://thelifetemple.com/

Contact Number: 90 90 90 42 52

Email ids:

[email protected]

thelifetemple@gmail.com

Facebook Page: https://www.facebook.com/thelifetemplechurch/

Leave a comment

You Cannot Copy My Content Bro