Brother JK Christopher Testimony | JK క్రిస్టోఫర్ గారి సాక్ష్యం

Testimony / సాక్ష్యం

JK Christopher గారికి చిన్నప్పటి నుండి సంగీతం అంటే చాల ఇష్టంగా ఉండేవారు. అయన నాన్న గారు కూడా సంగీత పరిచర్యలో ఉండేవారు అయన చిన్నగా ఉన్నప్పుడు.

JK Christopher గారు 2 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఆయనకు జబ్బు చేసి కళ్ళు తేల వేశారు. చనిపోతారు అని అనుకోని అయన తల్లితండ్రులు యేసయ్య మీరే ఈ బిడ్డను ఇచ్చారు.  ఈ బిడ్డ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, మీ చితమైతే బ్రతికించి మీ కోసం వాడుకోండి, మీ చిత్తం కాకపోతే తీసుకోండి అని వేడుకున్నారు.

సర్వశక్తుడైన దేవుడు అయన నామ మహిమ కోసం ఆయనను స్వస్థ పరిచాడు.

అయన ఫస్ట్ మీటింగ్స్ లో డ్రమ్స్ వాయించేవారు తరువాత కీబోర్డ్ నేర్చుకున్నారు.

JK Christopher Testimony
JK Christopher Testimony

2000 సంవత్సరంలో  అయన హైదరాబాద్ వచ్చి ఆల్బం కోసం అయన వచ్చినప్పుడు చాలామంచి ఇలాంటీ మ్యూజిక్ మేము ఈ కాలంలో ఎవరి దగ్గర వినలేదు నీ దగ్గర మేజిక్ ఉంది అని ఆయనకు సెక్యూలర్ మ్యూజిక్ కోసం పని చేయమని చెప్పారు.

తరువాత ఆయన ఇంట్లో వాళ్ళతో మాట్లాడి అయన  సెక్యూలర్ మ్యూజిక్  కోసం పనిచేయడం మొదలుపెట్టారు. 2008 లో క్రిస్టోఫర్ గారికి పెళ్లయింది.

2009 లో అయన భార్య మీరు ఫిలిమ్స్ కి మ్యూజిక్ చేస్తున్నారా మా నాన్న  మీ నాన్న ఇద్దరు దైవజనులు కదా   మీరు ఆలా చేయడం తప్పు అని వారించడం జరిగింది.

 తరువాత అయన బైబిల్ చదవడం మొదలుపెట్టారు , దేవుడు ఆయనతో నేను నీకు ఇచ్చిన తలాంతును నా కోసమే వాడు అనే విధంగా మాట్లాడం జరిగింది. అయినా కూడా ఆర్ధిక పరమైన విషయంలో ఆలోచించి అయన ఆలా నెట్టి వేసుకుంటూ వచ్చారు.

2010 జనవరి లో ఆయనకు యెషయా 66:13 “ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను అని వాగ్దానం వచ్చింది”.

2010 ఫిబ్రవరి లో అయన మరల ఫిలిం మ్యూజిక్ కి పని చేస్తుండగా ఆయనకు అస్వస్థత కలిగింది. ఆరోజు వాంతులు విరోచనాలు అయితే అయన టాబ్లెట్ తెచ్చుకొని తగ్గిపోతుందిలే అనుకోని తన రూమ్ లోకి వెళ్లి మ్యూజిక్ చేస్తుండగా తెల్లవారు జాము అవుతుండగా  బాగా శరీరం డిహైడ్రేట్ అయ్యి కళ్ళు తేలేస్తుండగా తన భార్య,తమ్ముడు,టీం మేట్స్  ఆయనను హాస్పిటల్ కి తీసుకెళ్లారు.  డాక్టర్ గారు సెలైన్ పెడతానికి ట్రై చేస్తుంటే ఆ సూది పెట్టడానికి కష్టం అయిపోయి పెద్ద హాస్పిటల్ కి ఇమ్మిడియట్ గా తీసుకెళ్లండి పరిస్థితి సీరియస్ గా ఉంది అని చెప్పాడు.

తన తమ్ముడు,టీం మేట్స్  ఆయనను హాస్పిటల్ కి తీసుకెళ్లాక  వాళ్ళు పల్స్ డౌన్ అయ్యిపోయింది, సీరియస్ గా ఉంది పరిస్థితి వేరే హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లిన ఉపయోగం లేదు.  ఇతనిని ఇంటికి తీసుకెళ్లండి బ్రతకడు అని చెప్పారు.

చనిపోయిన పర్లేదు మీరు ట్రీట్మెంట్ చెయ్యండి అని చెప్తే వాళ్ళు సంతకాలు పెట్టించుకుని సెలైన్ పెడతామంటే కుదరడం లేదు. పల్స్ పడిపోయింది. అందరికి చెప్పేసుకోండి ఇంకా బ్రతకాదు అని చెప్పారు.

అప్పుడు వాళ్ళ భార్య అయన అమ్మ గారు ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక పాస్టర్ గార్లు అయన కోసం ప్రార్ధన చేయడం జరిగింది.  ఆ సమయం లో దేవుని శక్తి ఆయనను తాకింది. సెలైన్ పెట్టడానికి నరాలు దొరికాయి అలాగే అయన శరీరం మందులు శరీరం లో పని చెయ్యడం జరిగింది.

ఆ సమయం లో క్రిస్టోఫర్ గారు నూతన సంవత్సర వాగ్గానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయనకు సూదులు అంటే భయం కానీ దేవుడు అలంటి పరిస్థితో తల్లిలా ఆదరించాడని.

ఇంకా సినిమా కోసం కాదు దేవుని కోసమే తన తలాంతులు వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు.

సినిమాలకోసం పనిచేస్తున్న రోజుల్లో చాల సంపాదన వచ్చేది కానీ నిలువ ఉండేద కాదు అని అయన చెప్పారు.

ఈ సినిమాల మ్యూజిక్ వదిలేసినాక ఆయనకు ఆర్ధికంగా చాల ఇబ్బందులు ఎదురైనాయి. అలంటి సమయం లో ఆయన దేవుని పైనే ఆధారపడడం మొదలుపెట్టారు.

తరువాత బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చిన కూడా అయన వెనుకాడుగెయ్యలేదు.

జీవితం లో ఒక్క ఆత్మనైనా రక్షించాలని అయన ధ్యేయమని చెప్పారు.

Youtube Link

JK Christopher Testimony in telugu

Please Share this Article

Leave a comment

You Cannot Copy My Content Bro