యెహోవా నా బలమా | Yehova Naa Balama Lyrics | Andhra Christhava Keerthanalu
Telugu Lyrics
Yehova Naa Balama Lyrics in Telugu
యెహోవా నా బలమా – యదార్థమైనది నీ మార్గం – పరిపూర్ణమైనది నీ మార్గం (2)|| యెహోవా||
1. నా శత్రువులు నను చుట్టిననూ – నరకపు పాశములరికట్టిననూ (2)
వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)
విడువక నను ఎడబాయని దేవా (2) || యెహోవా ||
2. మరణపుటురులలో మరువక మొరలిడ – ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2)
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2)
ఆదరెను ధరణి భయకంపముచే (2) || యెహోవా ||
3. నా దీపమును వెలిగించువాడు – నా చీకటిని వెలుగుగా చేయును (2)
జలరాసులనుండి బలమైన చేతితో (2)
వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) || యెహోవా ||
4. పౌరుషముగల ప్రభు కోపింపగా – పర్వతముల పునాదులు వణకెను (2)
తన నోటనుండి వచ్చిన అగ్ని (2)
దహించివేసెను వైరులనెల్లన్ (2) || యెహోవా ||
5. మేఘములపై ఆయన వచ్చును – మేఘములను తన మాటుగ జేయును (2)
ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2)
అపజయమిచ్చును అపవాదికిని (2) || యెహోవా ||
6. దయగలవారిపై దయ చూపించును – కఠినులయెడల వికటము జూపును (2)
గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2)
సర్వమునెరిగిన సర్వాధికారి (2) || యెహోవా ||
7. నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును – ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2)
రక్షణ కేడెము నాకందించి (2)
అక్షయముగ తన పక్షము జేర్చిన (2) || యెహోవా ||
8. యెహోవా జీవముగల దేవా – బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2)
అన్యజనులలో ధన్యత చూపుచు (2)
హల్లెలూయ స్తుతిగానము చేసెద (2) || యెహోవా ||
English Lyrics
Yehova Naa Balama Lyrics in English
Yehova Naa Balamaa – Yadhardhamainadhi Nee Maargam – Paripoornamainadhi
Nee Margam (2) || Yehova ||
1. Naa Sathrvulu Nanu Chuttinanu – Narakapu Prasamularikattinanu.. (2)
Varadhavale Bhakthiheenulu Porlina (2)
Viduvaka Nanu Yedabaayani Dheva (2) || Yehova ||
2. Maranaputurulalo Maruvaka Moralida – Unnathadhurgamai
Rakshanasrungamai (2)
Thana Aalayamulo Naa Mora Vinenu (2)
Adharenu Dharani Bhayakampamuche (2) || Yehova ||
3. Naa Dheepamunu Veliginchuvadu – Naa Cheekatini Velugugaa Cheyunu (2)
Jalarasulanundi Balamaina Chethitho (2)
Velupala Cherchina Balamaina Dhevudu (2) || Yehova ||
4. Paurushamugala Prabhu Kopimpagaa – Parvathamula Punadhulu Vanakenu (2)
Thana Notanundi Vachina Agni (2)
Dhahinchivesenu Vairulanellan (2) || Yehova ||
5. Meghamulapai Ayana Vachunu – Meghamulanu Thana Maatuga Jeyunu (2)
Urumula Merupula Menduga Jesi (2)
Apajayamichunu Apavaadhikini (2) || Yehova ||
6. Dhayagala Vaaripai Dhaya Choopinchunu – Katinula Yedala Vikatamu Joopunu (2)
Garvistula Yokka Garvamunanuchu (2)
Sarvamu Nerigina Sarvadhikari (2) || Yehova ||
7. Naa Kaallanu Ledi Kaallagaa Jeyunu – Etthaina Sthalamulo Sakthitho Nilipi (2)
Rakshana Kedemu Naakandhinchi (2)
Akshayamuga Thana Pakshamu Jerchina (2) || Yehova ||
8. Yehova Jeevamugala Dheva – Bahugaa Sthuthulaku Arhuda Neeve (2)
Anyajanulalo Dhanyatha Choopuchu (2)
Halleluya Sthuthigaanamu Chesedha (2) || Yehova ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Yehova Naa Balama Ringtone Download
MP3 song Download
Yehova Naa Balama MP3 song Download
More Andhra Kraisthava Keerthanalu
Click Here for more Andhra Kraisthava Keerthanalu