ఏ పాపమెరుగని యో పావన మూర్తి | Ye Papamerugani Song Lyrics

ఏ పాపమెరుగని యే పావనామూర్తి ll YE Papamerugani Ye Pavanamurthi ll Good Friday Song Lyrics

Telugu Lyrics

Ye Papamerugani Song Lyrics in Telugu

పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా

నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా (2)


1. ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా

ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సొమ్మ – సిల్లిపోతివ రక్షకా   || ఏ పాప ||


2. కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా

సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా   || ఏ పాప ||


3. చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా

కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా     || ఏ పాప ||


4. ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా

నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా    || ఏ పాప ||


5. పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా

సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా   || ఏ పాప ||


6. బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా

ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము    || ఏ పాప ||


7. కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా

ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి    || ఏ పాప ||

English Lyrics

Ye Papamerugani Song Lyrics in English

Ye Paapamerugani Yo Pavana Moorti Paapa Vimochakunda

Na Paali Daivama Na Paapamula Kora Kee Paatlunondinaava (2)


1. Mullato Kireeta – Malli Nee Siramupai – Jallatamuna Motthiraa

Mulla Potlaku Siramu – Thalladillaaga Somma – Sillipothiva Rakshakaa

|| Ye Paapa ||


2. Kaluvari Giri Dhanuka – Siluva Moyaleka – Kalavaramu Nondhinaava

Siluva Neetho Moya – Thuluvulu Veraokani – Thoduga Nicchinaaraa || Ye Paapa ||


3. Chedugu Yudhulu Bettu – Padaraani Patlaku – Sudivadi Nadachinaava

Kadaku Kalvari Giri – Kada Kegi Silvanu – Grakkuna Dhinchinaava || Ye Paapa ||


4. Aa Kaala Karmulu – Bhikarambuga Ninnu – Aa Koyyapai Nunchiraa

Nee Kaalu Sethulu – Aa Koyyake Soodhi – Mekulatho Grucchinaaraa || Ye Paapa ||


5. Paluvidhambula Shramalu – Chelarega Dhandrika – Nelugetthi Moraliditivaa

Siluvapai Palumaaru – Kaluguchundedhi Baadha – Valana Daahamu Naayenaa

|| Ye Paapa ||


6. Ballidhundagu Bantu – Ballaemuna Nee Prakka – Jilli Bada Bodachinaadaa

Ullolamulavale Nalla Neerubukang Jallaare Gadha Kopamu || Ye Paapa ||


7. Kata Kata Paapa Sam – Katamu Baaputu Kintha – Patu Baadha Nondeenaava

Etuvantidhi Prema – Yetuvantidi Shaantha – Metula Varnintu Swami || Ye Paapa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

MP3 song Download

Ye Papamerugani MP3 song Download

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

More Andhra Krasithava Keerthanalu

Click Here for more Andhra Krasithava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro