విత్తనం విరుగకపోతే | Vithanam Virugakapothe Song Lyrics

విత్తనం విరుగకపోతే | Vithanam Virugakapothe Song Lyrics || Latest Telugu Christian Song by Pastor Asher Andrew

Telugu Lyrics

Vithanam Virugakapothe Song Lyrics in Telugu

విత్తనం విరుగకపోతే ఫలియించునా – కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా (2)

అను పల్లవి: 

శ్రమలే నా అతిశయం – శ్రమలోనే ఆనందం

శ్రమలలోనే ఉత్సాహం – విశ్వాసమే నా బలం (2)   || విత్తనం ||


1. పోరాటం దేవునిదైతే నాకేల ఆరాటం – విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం (2)

గొల్యాతును పుట్టించినదే – దావీదును హెచ్చించుటకే (2)

కిరీటం కావాలంటే – గొల్యాతులు రావొద్దా (2)

శ్రమలే నా అతిశయం – శ్రమలోనే ఆనందం

శ్రమలలోనే ఉత్సాహం – విశ్వాసమే నా బలం (2)   || విత్తనం ||


2. సేవించే మా దేవుడు రక్షించక మానునా – రక్షించక పోయినా సేవించుట మానము (2)

ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే (2)

అగ్నిలోకి ప్రభువే రాగా – ఏదైనా హాని చేయునా (2)

శ్రమలే నా అతిశయం – శ్రమలోనే ఆనందం

శ్రమలలోనే ఉత్సాహం – విశ్వాసమే నా బలం (2)   || విత్తనం ||


3. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు – శ్రమపెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)

ఫరోను పుట్టించినదే – ప్రభు శక్తిని చాటుటకే (2)

వాగ్దానం నెరవేర – ఫరోలు రావొద్దా (2)

శ్రమలే నా అతిశయం – శ్రమలోనే ఆనందం

శ్రమలలోనే ఉత్సాహం – విశ్వాసమే నా బలం (2)   || విత్తనం ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Sung by: Dr.Asher Andrew

Music: A John Pradeep

More Telugu Gospel Songs

Click Here for more Telugu Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro