వీచే గాలి స్వాగతమనియే | Veeche Gaali Swagathamaniye Song Lyrics

వీచే గాలి స్వాగతమనియే | Veeche Gaali Swagathamaniye Song Lyrics || Latest Telugu Christmas Song by Pastor Shalem Raju Garu

Telugu Lyrics

Veeche Gaali Swagathamaniye Song Lyrics in Telugu

వీచేగాలి స్వాగతమనియే – వెలిగే తారా సందడి చేసే (2)

ఇన్నినాళ్ళ నిరీక్షణ ఫలియించగా (2)

శ్రీ యేసుడే ఇలలోన ఉదయించేగా (2)

సర్వోన్నతమైన స్థలములలో – దేవునికే మహిమ కలుగును గాక (2)

దేవునికే ఘనత కలుగును గాక (2)          || వీచేగాలి ||

అంభస్య పారే భువనస్య మధ్యే  – నాకస్య పృష్టే మహతో మహీయాన్ (2)

శుక్రేణ జ్యోతి గుంషి సమను – ప్రవిష్ట: ప్రజాపతిశ్చరతి గర్భే అంత:

ప్రజాపతిశ్చరతి గర్భే అంత:


1. సృష్టికర్త యైనవాడు సృష్టిగా మారే – కాలమే లేనివాడు కాలము చేరే (2)

దేవుడేయున్నవాడు మనిషిగా మారే (2)

మాతృ గర్భమందు చేరి ఆటలు ఆడే (2)

ఆటలు ఆడే …    || వీచేగాలి ||


2. అనంతమై యున్నవాడు అల్పుడు ఆయే – రాజుగా ఉన్నవాడు దాసుడు ఆయే (2)

పుడమియే పులకించగ పాదము మోపే (2)

దూతలంత సంతసించి స్తోత్రము చేసే (2)

స్తోత్రము చేసే …  || వీచేగాలి ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro