Sthothrinchi keerthinthumu Song Lyrics | స్తోత్రించి కీర్తింతుము సాంగ్ లిరిక్స్

Telugu Lyrics

Sthothrinchi keerthinthumu Lyrics in Telugu

స్తోత్రించి కీర్తింతుము – ఘనపరచెదము – కొనియాడెదము

ఆదరించి – కాపాడువాడు – ఈడేర్చువాడు   (2)    || స్తోత్రించి ||


మనకింత వరకు సహాయపడెన్ – తానప్పగించుకొనే మనకై

మనల నడిపెను సుఖముగను

తనదు సత్యము నేర్పించి – కనుపాపగ కాచె ఆ.. ఆ.. ఆ..  

తనదు సత్యము నేర్పించి – కనుపాపగ కాచె || స్తోత్రించి ||


ఈ ధరలోని నరులలో – యధార్థ హృదయులకు

ముదమున తనచిత్తము తెలుపున్

పదిలముగా ప్రభుకన్నులు – పృథివిని పరుగెత్తు ఆ.. ఆ.. ఆ..

పదిలముగా ప్రభుకన్నులు – పృథివిని పరుగెత్తు   || స్తోత్రించి ||         


అన్ని సమయములలో – కన్నులతో బోధించును

నన్ను మార్చెను తప్పినన్

పెన్నుగ హృదయము నాదరించె – అన్న గురుయేసు ఆ.. ఆ.. ఆ..  

పెన్నుగ హృదయము నాదరించె – అన్న గురుయేసు  || స్తోత్రించి ||


అగ్ని వంటి కన్నులు – విఘ్నముల నుండి విడిపించు

తగిన సహాయము చేయును

ఎక్కాలమందును కునుకవు – మక్కువ పిల్లలకు ఆ.. ఆ.. ఆ..

ఎక్కాలమందును కునుకవు – మక్కువ పిల్లలకు  || స్తోత్రించి ||


హాగరును చూచిన కన్నులు – అనేకుల చూచెను

ఇశ్రాయేలుల కనికరించె

ఎజ్రాకు సహాయపడెన్ – నిద్రించవు నెపుడు ఆ.. ఆ.. ఆ..

ఎజ్రాకు సహాయపడెన్ – నిద్రించవు నెపుడు   || స్తోత్రించి ||


నీతిమంతుల జూచె – దాదిబోలె కాచెన్

జ్యోతుల వలె నుండును

అతిబలమిచ్చు అవసరతన్ – క్షితినిను విడువడు ఆ.. ఆ.. ఆ..

అతిబలమిచ్చు అవసరతన్ – క్షితినిను విడువడు  || స్తోత్రించి ||


ఏడు కన్నులు గలవాడు – నాడు నేడు కాపాడును

ఎడతెగని చెడుగుల బాపున్

రేడుల నేర్పరచు వాడు – పాడుడి హల్లెలూయా ఆ.. ఆ.. ఆ..

రేడుల నేర్పరచు వాడు – పాడుడి హల్లెలూయా  || స్తోత్రించి ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Sthothrinchi keerthinthumu Song Lyrics

Bible Reference

1 దినవృత్తాంతములు Chronicles 16:9

యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.

How to Play on Keyboard

Sthothrinchi keerthinthumu Song on keyboard

MP3 song Download

Sthothrinchi keerthinthumu MP3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro