సందడి 6 లిరిక్స్ | Sandhadi 6 Song Lyrics

సందడి 6 లిరిక్స్ | Sandhadi 6 Song Lyrics || Sandhadi 6 (Joyful Noise)

Telugu Lyrics

Sandhadi 6 Song Lyrics in Telugu

సంబరం ఆశ్చర్యాలతో భూమి ఊపిరి బిగబట్టెనే

శిశువు మృదువు హస్త స్పర్శను పుడమి ముద్దాడెనే

ఆకాశం చుక్కలతో అలంకరించుకొనెనే

అందులో ఒక తార రక్షకుని జాడ తెలిపింది

చమ్మక్కు చమ్మక్కు మంటూ ఒక తార వెలసెనే – నింగి నేల ఏకమై సందడి చేసెనే

కన్యక గర్భాన రారాజు పుట్టాడే – ఊరు వాడ వీధులలో సందడి చేద్దామే

Chorus:

సందడి సందడి సందడి – సందడి సందడి చేద్దామే

బేత్లెహేము పురములోన సందడి చేద్దామే

సందడి సందడి సందడి – సందడి సందడి చేద్దామే

దావీదు పురములోన సందడి చేద్దామే

1. నక్షత్ర రాశులు వింత కాంతులీనే – సర్వదూతాలి సిద్దపడెనే (2)

యుగయుగాల నిరీక్షణ ఫలియించెనే – సర్వ సృష్టి నీ రాకకై సాక్ష్యమిచ్చెనే

సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ –

భూమిపై ఉన్న వారికి సమాధానం అని దూత చెప్పెనే

చమ్మక్కు చమ్మక్కు మంటూ ఒక తార వెలసెనే – నింగి నేల ఏకమై సందడి చేసెనే

కన్యక గర్భాన రారాజు పుట్టాడే – ఊరు వాడ వీధులలో సందడి చేద్దామే

2. అయ్యో మరియమ్మ అవమానము పొందే – గాబ్రియేలు దూతొచ్చి భయపడకని చెప్పెనే (2)

పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడని చెప్పెనే – సర్వోన్నతుని కుమారుడని చెప్పెనే

యుగయుగాలనేలే రారాజు – నీలో నుండి వచ్చుననెనే

ఇమ్మానుయేలు దేవుడు… – ఏసుక్రీస్తు అని చెప్పెనే

చమ్మక్కు చమ్మక్కు మంటూ ఒక తార వెలసెనే – నింగి నేల ఏకమై సందడి చేసెనే

కన్యక గర్భాన రారాజు పుట్టాడే – ఊరు వాడ వీధులలో సందడి చేద్దామే

3. నదులు సంతోషముతో ఉప్పొంగెనే – అలలు నాట్యమాడి స్తుతియించెనే (2)

సస్యశ్యామలం గుసగుసలాడే – శాంతి సమాధానం వచ్చిందని చెప్పెనే

సర్వ భూమి నీ రాకతో పరవశించెనే – సృష్టి తలవంచి స్వాగతించెనే

చమ్మక్కు చమ్మక్కు మంటూ ఒక తార వెలసెనే – నింగి నేల ఏకమై సందడి చేసెనే

కన్యక గర్భాన రారాజు పుట్టాడే – ఊరు వాడ వీధులలో సందడి చేద్దామే

సందడి సందడి సందడి – సందడి సందడి చేద్దామే

బేత్లెహేము పురములోన సందడి చేద్దామే

సందడి సందడి సందడి – సందడి సందడి చేద్దామే

దావీదు పురములోన సందడి చేద్దామే

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Dr Shalem Raj, Pastor Azuba Daniel

Music: Dr Shalem Raj, John Gideon, Alfred Kalyanapu

Tune, Programming, music arrangement, DOP, Audio-Video Editing, and producer: Dr Shalem Raj

Vocals and keys: Ps. John Gideon

Vocals and keys: Alfred Kalyanapu

Vocals and Guitars: Desmond John

Rhythms: Balu

Mixing and Mastering: Vinay Kumar, HYD.

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro