రవికోటి తేజుడు | Ravikoti Thejudu Song Lyrics

రవికోటి తేజుడు | Ravikoti Thejudu Song Lyrics || Telugu Christian Praise Song

Telugu Lyrics

Ravikoti Thejudu Song Lyrics in Telugu

నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు – నా దేవుడే నాకు మార్గ దర్శకుడు

నా దేవుడే నాకు నిత్య పోషకుడు – నా దేవుడే నాకు జీవన దాయకుడు

గతి లేని నన్ను వెదకిన – అతి కాంక్షనీయుడాయనే

మితి లేని ప్రేమ చూపిన – రవి కోటి తేజుడాయనే        || నా దేవుడే ||


1. శ్రమలలో  నా తోడుగా.. నన్ను నడిపించెను

నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు

మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను

నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు

క్షణమైన మరువని వీడని నా క్షేమ శిఖరము

క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము

క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను      || గతి లేని ||


2. వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను

నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము

ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను

నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము

నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా

నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే

విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను        || గతి లేని ||

English Lyrics

Ravikoti Thejudu Song Lyrics in English

Naa Dhevude Naku Prana Snehithudu

Naa Dhevude Naaku Maarga Dharsakudu

Naa Dhevude Naaku Nithya Poshakudu

Naa Dhevude Naaku Jeevana Dhaayakudu

Gathi Leni Nannu Vedhakna – Athi Kankshaneeyudayane

Mithi Leni Prema Choopina – Ravi Koti Thejudayane || Naa Dhevude ||


1. Sramalalo Naa Thoduga – Nannu Nadipinchenu

Naa Needaga Vennantiyunna Naa Prananadhudu

Maranapu Sankellanundi Nannu Vidipinchenu

Naa Bandhakalanni Thenchi Vesina Naa Neethi Sooryudu

Kshanamaina Maruvani Veedani Naa Kshema Sikharamu

Kshamiyinchi Naaku Andhinchenu Ee Rakshnanandhamu

Kshayamaina Brathuku Maarchi Akshayathanosagenu || Gathi Leni ||


2. Vaakyame Naa Jeevamai Nannu Brathikinchenu

Naa Paadhamulaku ChiruDheepamaina Naaa Divya Thejamu

Aathmaye Paripoornamai Nannu balaparachenu

Naa Aadugu Jaadalanu Sthiramu Chesina Naa Jeeva Maargamu

Naa Gamyamemito Theliyaka Naa Parugu Aagipoga

Naa Cheyipatti Nanu Nadipina Naa Maargadharsi Yese

Viluvaina Prema Naapai Niluvella Kuresenu || Gathi Leni ||

Song Credits

Written and Tune Composed: Kranthi Chepuri

Vocals: Nissy John, Hadlee Xavier

Music Programmed, Arranged, and Mixed: Hadlee Xavier

Produced: Ramson Chepuri

Youtube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro