Telugu Lyrics
Randi Rarandoy Song Lyrics in Telugu
రండి రారండోయ్ యేసయ్యను చూసొద్దాం – రండి రారండోయ్ బెత్లహేముకు పోయొద్దాం (2)
యేసయ్య పుట్టెను దైవ కుమారునిగా – ప్రభువే వెలసెను దావీదు పురములో (2)
రాజాధిరాజు ప్రభువుల ప్రభువే
రండిరండి రారండి యేసయ్యను చూసొద్దాం
రండి రండి రారండి – రాజాది రాజును పూజిద్దాం (2)
రాజుల రాజు పసి బాలుడై (2)
పశువుల పాకలో పవళించినాడు (2)
1 ) పరమందు దూతలు భూవి పైకి దిగివచ్చారు
సర్వోన్నత స్థలములలో – దేవుని మహిమ పరిచారు (2)
ఆ గొర్రెల కాపరులు దూతలను చూశారు (2)
రక్షకుడు నేడు మన కొరకు పుట్టాడని – శిశువును చూచి ఎలుగెత్తి చాటారు
(2) (రండి రండి రారండి)
2 ) చుక్కను చూచిన ఆ తూర్పు జ్ఞానులు – బెత్లహేము పురమునకు కానుకలు తెచ్చారు (2)
ప్రభువును చూచి పూజించి వెళ్లారు (2)
లోకానికి రక్ష కుడు పుట్టాడని – పాప క్షమాపణ గొప్ప రక్షణ
తెచ్చాడని (2) (రండి రండి రారండి)
Song Credits
Lyrics, Tune & Produced by: David Marumulla
Music: Sudhakar Rella
Vocals: Joshua Gariki
Rhythms: Kishore Emmanuel
Live Tapes: Prabakar Rella & Prabhu
Mix & Master: Arif Dani
Dop: Harsha Singavarapu
Edit & VFX: Light House Media
Title art: Devanand
Poster: Bethany Visual Studios
Special Thanks: A.R.Kishore & Bro.Kedari.p
Technician: Manikanta
Location: Benila Church & Bethany Church Eluru
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs