రక్షకుడు పుట్టెను | Rakshakudu Puttenu Song Lyrics || Telugu Christmas Song
Telugu Lyrics
Rakshakudu Puttenu Song Lyrics in Telugu
రక్షకుడు పుట్టెను లోకము వెలుగాయెను
రక్షణతో నింపెను లోకమే గుర్తించెను – లోకమే గుర్తించెను (2)
గొల్లలంత వచ్చిరి పరుగులతో వచ్చిరి – జ్ఞానులంత వచ్చిరి ఈవులతో వచ్చిరి
సాగిలపడుదుము పూజింతుము యేసుని – సజీవ యాగముగ అర్పించెదము యేసుకే
హల్లేలూయా హల్లేలూయా – యేసునే పూజింతుము
హల్లేలూయా హల్లేలూయా – యేసునే సేవింతుము (2)
1. కన్య గర్భమునందు కరుణగల దేవుడు
ధన్యులగుటకు రండి పరమ దేవుడొచ్చెను- పరమ దేవుడొచ్చెను (2)
పుట్టేనేసు మన కొరకు జీవమార్గం చూపుటకు – సర్వశక్తిగల యేసు భూవికే దిగి వచ్చెను
సాగిలపడుదుము పూజింతుము యేసుని – సజీవ యాగముగ అర్పించేదము యేసుకే
హల్లేలూయా హల్లేలూయా – యేసునే ప్రేమింతుము
హల్లేలూయా హల్లేలూయా – యేసునే స్తుతియింతుము (2)
2.చింతేలేదిక సర్వజనాంగమా సంతోషమేనొందుము మోక్ష భాగ్యమిచ్చెను- మోక్ష భాగ్యమిచ్చెను. (2)
చెదరిన గొర్రెలను వెదకి తన మందలో జేర్చును – శత్రుబాధలేక నిన్ను తన పరమున చేర్చును
సాగిలపడుదుము పూజింతుము యేసుని – సజీవ యాగముగ అర్పించేదము యేసుకే
రక్షకుడు పుట్టెను లోకము వెలుగాయెను –
రక్షణతో నింపెను లోకమే గుర్తించెను – లోకమే గుర్తించెను (2)
గొల్లలంత వచ్చిరి పరుగులతో వచ్చిరి – జ్ఞానులంత వచ్చిరి ఈవులతో వచ్చిరి
సాగిలపడుదుము పూజింతుము యేసుని – సజీవ యాగముగ అర్పించెదము యేసుకే
హల్లేలూయా హల్లేలూయా – యేసునే ఘనపరచేదము
హల్లేలూయా హల్లేలూయా – యేసునే కొనియాడేదము
Song Credits
Lyrics and Tune: Raju Rao
Music and Vocals: Ashok Kumar
DOP and editing: Don Paul
Mix and mastered by: Sivanesh Natarajan
Title Design: Manohar Golla
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs