రా నా ప్రియా యేసు రా | Ra Na Priya Yesu Ra || Telugu Christian Praise Song by Pranith Paul
Telugu Lyrics
Ra Na Priya Yesu Ra Lyrics in Telugu
ఎత్తుకే ఎదిగినా – నామమే పొందినా (2)
నాకు మాత్రము నీవే చాలయ్యా – నీ జాడలో నే నడుస్తానయ్యా
నీ కౌగిలిలో నే ఉంటా
రా... నా ప్రియ యేసు రా... హో… ఓ …
రా… నా ప్రియ యేసు రా (2)
1. ఆశీర్వాదములు కావయ్యా – అభిషేకము కొరకు కాదయ్యా (2)
నీవే నా ఆశీర్వదమయ్యా – నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2)
నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా
నీ జాడలో నే నడుస్తానయ్యా
నీ కౌగిలిలో నే ఉంటా… ఓ ….
రా… నా ప్రియ యేసు రా… హో… ఓ …
రా… నా ప్రియ యేసు రా (2)
2. నీకై నేను – నాకై నీవు
ఉంటే చాలయ్యా – అదియే నా ఆశ దేవా …
నాలో ఉన్నవాడా – నాతో ఉన్నవాడా
నీవుంటే చాలయ్యా – రావా నాకై
నా ప్రాణం నీవయ్యా – నా ప్రేమ నీకేయ్యా
నీవే నా ఊపిరి యేసయ్యా
నీ పాదాలపై అత్తరునై నేనుంటా
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా
3. పరలోకము కొరకు కాదయ్యా – వరముల కొరకు కాదయ్యా
ప్రవచనముల కొరకు కాదయ్యా – నీవుంటే నాకు చాలయ్యా
నీ శ్వాసే పరలోకం దేవా – నిను పోలిన వరములు ఏవి లేవయ్యా
ఎన్నెన్ని వరములు నాకున్నా – నీవు లేని జీవితమే వ్యర్ధముగా
నీ కోసమే బ్రతికెదను యేసయ్యా – నీ కోసమే చావైనా మేలేగా
నీ… కై ఎవరు రాకున్నా హో…
నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ…
నీ హతసాక్షిగ నే చస్తా – రా… నా ప్రియా యేసు రా…
4. నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే
నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే
కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు
నీకై నే వేచి ఉన్నా రావా నాకై…
నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని
నీవే నా ఊపిరి యేసయ్యా హో…
నీ గుండె లోతున ఆలోచన నేనేగా
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా… హో…
5. నాకు మాత్రము నీవే చాలయ్యా (4)
వీడని ప్రియుడవు రావా నాకై
నిన్ను పోలి ఉంటా నే రావా నాకై
వేచియున్నా నీ కోసం రావా నాకై
ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై
రావా…దేవా… రావా…దేవా…
నాకు మాత్రము నీవే చాలయ్యా
నా కోసము రావా యేసయ్యా… త్వరగా ….
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics, Vocals, and Music by: Pranith Paul
More Praise Songs
Click Here for more Telugu Christian Praise Songs