ప్రేమంటూ ఏదైనా ఉంటే | Premantu Edhaina Unte Song Lyrics

Telugu Lyrics

Premantu Edhaina Unte Song Lyrics in Telugu

ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేలే అది యేసేలే –

మనసున్న మనిషెవరయినా మరి స్పందించి ప్రేమించునులే (2)

మనసా మనసా స్పందించు – నిజమైనప్రేమను గుర్తించు (2)

మనసారా నిను ప్రేమించే ఆ దేవుని ప్రేమకు స్పందించు   || ప్రేమంటూ ||


1.ఒక్క చూపులోనే పుట్టుకొచ్చు ప్రేమలెన్నో

ఒక్క మాటతోనే మాయమవ్వు ప్రేమలెన్నో

వేయినోళ్లు చెప్పలేని గొప్ప భావమే ప్రేమ

ఏ కళ్ళు చూడలేని దైవరూపమే ప్రేమ

ఊహించలేనంతగా నిను ప్రేమించె ఆ దైవము

చేతల్లో చూపాడుగా నీపై ఉన్న ఆ ప్రేమను

ఇంకెందుకో ఆలస్యము ప్రేమించు యేసయ్యను

ఇంకెన్నాళ్ళిలా నిర్లక్ష్యము ఏరోజో నీ అంతము         || ప్రేమంటూ ||


2.మంచివాడ్ని కూడా ద్వేషించునీలోకం

ఎంత పాపినైన కూడా ప్రేమించెనే దైవం

పాపమంటే రోగం దానివల్లనే మరణం

యేసు ప్రేమలోనే వైద్యం యేసు రక్తమే ఔషధం

మన్నిస్తూ ఉన్నాడుగా నీలో ఉన్న పాపాలను

కాపాడుతున్నాడుగా నీ ప్రాణాత్మదేహాలను

ఇంకెందుకో ఆలస్యము ప్రేమించు యేసయ్యను

ఇంకెన్నాళ్ళిలా నిర్లక్ష్యము ఏరోజో నీ అంతము        || ప్రేమంటూ ||

Song Credits

Lyrics, Tune & Music by Jonah Samuel

Singer- Anjana Sowmya

Music composed and arranged by Jonah Samuel

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Premantu Edhaina Unte Song Lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro