ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను | Premalo Paddanu Song Lyrics || Telugu Christian Song By Bro Anil Kumar
Telugu Lyrics
Premalo Paddanu Song Lyrics in Telugu
ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను…
ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను
నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను
ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను
నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను
స్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు – లాభం కోరే ప్రేమ కాదు
కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు – ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమ
మోహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమ కాదు
పై అందం చూసే ప్రేమ కాదు – పరిశుద్ధమైన ప్రేమ
ఇదే కదా… ప్రేమంటే (2)
ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ
దేవుని ప్రేమ ఇది || ప్రేమలో ||
1. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు
నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే
మొదటగా ప్రేమించింది నేను కాదు
నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే
కోరినాడు పిలిచినాడు – నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు
కుమ్మరించే ప్రేమ మొత్తం – నేను తప్ప ఎవ్వరు లేనట్టు
ఆకాశాన తనలో తాను – పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు
భువిలో నాపై ప్రేమ ఎందుకో…
ఏమి తిరిగి ఇవ్వలేని – ఈ చిన్న జీవి పైన
ప్రభువుకు అంత ప్రేమ దేనికో…
హే… ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక
నేను ప్రేమించకుండ ఎట్లా ఉంటాను
అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి
ఐ లవ్ యు చెప్పకుండ ఎట్లగుంటాను || ఇదే కదా ||
2. తన ప్రేమకు రుజువేంటని నేనడుగక ముందే
నా ప్రియుడు తన ప్రేమ రుజువుపరిచే
ప్రేమకు రుజువేంటని నేనడగక మునుపే
నా యేసు తన ప్రేమ రుజువుపరిచే
పాపమనే కూపమందు – నేను బంధీనైయుండఁగా
పాపమనే అప్పు చేత – బానిసై నేను అలసియుండగా
గగనపు దూరము దాటి వచ్చి – సిలువలో చేతులు పార చాపి
నువ్వంటే నాకింత ప్రేమనే…
రక్తముతో నను సంపాదించి – నా కళ్ళల్లో కళ్ళు పెట్టి
నీపై పిచ్చి ప్రేమ నాకనే…
హే… నన్ను తన సొత్తు చేసుకున్నాడు
నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు
మరల వచ్చి పెళ్లి చేసుకుంటాను
అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు || ఇదే కదా ||
3. ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ
వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ
ప్రేమతో నా యేసు రాసెను ప్రేమ లేఖ
వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ
ఆ లేఖ చదువుతుంటే – నా ప్రియుని తలపులు నాలో నిండే
ప్రభుని ప్రేమ లోతు తెలిసి – నా యేసుపై ప్రేమ పొంగి పొరలే
రేయింబవలు ప్రభు కావాలని – తనతో ఎప్పుడు కలిసుండాలని
నా ప్రాణము పరి తపియించెనే
యుగయుగములు నన్నేలేడివాడు – అని త్వరలోనే రానున్నాడని
ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే
హే… వింత అయిన ఆ యేసు ప్రేమ గూర్చి
నేను సర్వ లోకమునకు చాటి చెబుతాను
యేసు రక్తమందు శుద్ధులైన వారే
ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను || ఇదే కదా ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics and Vocals: Pastor Anil Kumar Garu
Ringtone Download
Premalo Paddanu Ringtone Download
Mp3 Song Download
Premalo Paddanu Mp3 Song Download