ప్రభు యేసుని వదనములో | Prabhu Yesuni Vadanamulo

ప్రభు యేసుని వదనములో | Prabhu Yesuni Vadanamulo || Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Prabhu Yesuni Vadanamulo Lyrics in Telugu

ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)

పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)

పరలోకముకై – చిర జీవముకై (2)

ప్రార్ధించెను నా హృదయం      || ప్రభు యేసుని ||


1. దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)

దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)

ధన పీడనతో – మృగ వాంఛలతో (2)

దిగాజారితి చావునకు         || ప్రభు యేసుని ||


2. యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)

ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)

ఇల వేడితిని – విలపించుచును (2)

ఈడేరెను నా వినతి        || ప్రభు యేసుని ||


3. పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2)

పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2)

పరలోకమే నా – తుది ఊపిరిగా (2)

పయనించితి ప్రభు కడకు      || ప్రభు యేసుని ||

English Lyrics

Prabhu Yesuni Vadanamulo Lyrics in English

Prabhu Yesuni Vadanamulo – Naa Devudu Kanipinche (2)

Paapathmula Brochutakai – Krupalolikina Kaluvarilo (2)

Paralokamukai – Chira Jeevamukai (2)

Prardhinchenu Naa Hrudayam || Prabhu Yesuni ||


1. Dishalanniyu Thirigithini – Naa Paapapu Dhaahamutho (2)

Dhaustyamulo Masaluchunu – Dhaurjanyamu Cheyuchunu (2)

Dhana Peedanatho – Mruga Vaanchalatho (2)

Dhigajaarithi Chaavunaku     || Prabhu Yesuni ||


2. Yesu Nee Rajyamulo – Bhuvikethenchidi Roju (2)

Ee Paapini Kshamiyinchi – Gnaapakamutho Brovumani(2)

Ila Vedithini – Vilapinchuchunu (2)

Eederenu Naa Vinathi      || Prabhu Yesuni ||


3. Paradhaisuna Ee Dhiname – Naa Aanandhamulonu (2)

Paalgondhuvu Neevanuchu – Vaagdhaanamu Cheyagane (2)

Paralokame Naa – Thudi Oopirigaa (2)

Payaninchithi Prabhu Kadaku      || Prabhu Yesuni ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: A B Maasilaamani

Mp3 Song Download

Prabhu Yesuni Vadanamulo Mp3 Song Download

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro