దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం | Parishudhula Anuraga Nilayam Lyrics

దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం | Parishudhula Anuraga Nilayam Lyrics || Thandri Sannidhi Ministries Song

Telugu Lyrics

Parishudhula Anuraga Nilayam Lyrics in Telugu

దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం

దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం (2)   || దేవాలయం ||

తనయులపై తండ్రి కృప చూపగా – తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయేగా (2)


1. స్తుతియే ధ్యాసగా త్యాగమే శ్వాసగా (2)

అపురూప బంధాల సౌధముగా – అణువణువు పులకించె మధురిమగా (2)

మర్మాల నిధిగా – ప్రవహించే జీవనదిగా (2)

ఎండిన బ్రతుకుల జీవింపజేసే – జీవాలయం ఈ దేవాలయం

జీవాలయం ఈ దేవాలయం

తనయులపై తండ్రి కృప చూపగా – తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయేగా (2)

|| దేవాలయం ||


2. వాఖ్యమే నడతగా ఆత్మయే సారథిగా (2)

చిగురించి ఆశల కోవెలగా – చిరకాల వాసమై నిలిచేనుగా (2)

యేసయ్యే గురిగా ఆనందాల ఝరిగా (2)

అన్ని వేళల ఆదరించే – నిత్యాశ్రయం ఈ దేవాలయం

దేవాలయం ప్రార్ధనాలయం

తనయులపై తండ్రి కృప చూపగా – తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయేగా (2)

|| దేవాలయం ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, and Music: Thandri Sannidhi Ministries

Vocals: Brother Hemanth Raj

Leave a comment

You Cannot Copy My Content Bro