నీవిచ్చిన వరమే కాదా | Neevicchina Varame Song Lyrics

నీవిచ్చిన వరమే కాదా | Neevicchina Varame Song Lyrics || Telugu Christian New Year song

Telugu Lyrics

Neevicchina Varame Song Lyrics in Telugu

నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం – నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం (2)

నను కాచావు నను దాచావు పోషించి నడిపావు

బలపరిచావు దృఢపరిచావు ధైర్యముతో నిలిపావు – ధైర్యముతో నిలిపావు

హల్లేలూయ ఆరాధన – హల్లేలూయ స్తుతి ఆరాధన  (2)


1. ప్రశాంతమైన జీవిత యాత్రలో అలలెన్నో రేగినా – పెను ఉప్పెనలాంటి పరిస్థితులే కెరటాలై ఎగసినా (2)

చుక్కానివి నీవై  – నా నావికుడవు నీవై  (2)

ఇంత వరకు నను క్షేమముగా నడిపిన నాథుడవై  (2)

హల్లేలూయ ఆరాధన- హల్లేలూయ స్తుతి ఆరాధన (2)


2. మరల తిరిగి రావూ నీవు గడిపిన దినములు – వ్యర్థపరచబోకూ నీ విలువైన గడియలు (2)

ప్రభుయేసు సాక్షిగా ఈ నూతన సంవత్సరమున  (2)

చేసుకో తీర్మానం అర్పించు నీ హృదయం  (2)

హల్లేలూయ ఆరాధన _ హల్లేలూయ స్తుతి ఆరాధన  (2)

Song Credits

Lyrics, Tune and Vocals: Sister Nissy Paul

Music: Sudhakar Rella

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More New Year Songs

Click Here for more Telugu Christian New Year Songs

Leave a comment

You Cannot Copy My Content Bro