Telugu Lyrics
Neeve Naa Thodu Song Lyrics in Telugu
నీవే నా తోడు నీడవై యుంటివి (2)
భయపడను నేను ఏనాటికి – నిలిచెదను యేసు నీ సాక్షిగా (2) ( నీవే నా తోడు )
1.కాలమెదురు తిరిగినా – కారుచీకటి కమ్మినా (2)
పదివేలమంది పైబడినను – నీవే నా బలము ధైర్యము (2) ( నీవే నా తోడు )
2.జలములలోబడి నే వెళ్ళినా – అగ్నిలో నే నడచినా (2)
నీ బాహువే నన్ను రక్షించును – విడువవు నను ఎడబాయవు (2) ( నీవే నా తోడు )
3.నిందలెన్ని నిలిచినా – అవమానమే క్రుంగదీసినా (2)
నా తలను పైకెత్తువాడవు నీవే – ఆనందముతో నిన్ను స్తుతియింతును (2) ( నీవే నా తోడు )
Song Credits
Lyrics & Tune: John Kennedy Bethapudi,
Vocals: Shweta Mohan,
Music: KY Ratnam
Media Promotions: [email protected]
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.