నీ సంకల్పంలో నేనున్నందున | Nee Sankalpamulo Nenunnandhuna Song Lyrics

నీ సంకల్పంలో నేనున్నందున | Nee Sankalpamulo Nenunnandhuna Song Lyrics | A R Stevenson | Telugu Christian Song

Telugu Lyrics

Nee Sankalpamulo Nenunnandhuna Song Lyrics in Telugu

నీ సంకల్పంలో నేనున్నందున – నను పిలిచి స్వీకరించిన నా దేవా  (2)

 నన్ను ముందుగా నిర్ణయించి – నీయందు స్వాస్థ్యముగా నన్నేర్పరచి

సమస్తము నా మేలుకై జరిగించుచున్నావా (2)   || నీ సంకల్పంలో ||


1.తరతరములకు ఉండును నీ సంకల్పములు – సదాకాలము నిలుచును నీ ఆలోచనలు (2)

నిన్ను దేవుడుగా గల జనులు ధన్యులు (2)

పూర్ణ మనస్సుతో నిను సేవించెదను (2)

నిను ప్రేమించెదను నీ రూపం పొందెదను (2) 

నీ సంకల్పంలో నేనున్నందున – నను పిలిచి స్వీకరించిన నా దేవా  (2)

లవ్ యు జీసస్ సర్వ్ యు జీసస్ – లవ్ యు సర్వ్ యు జీసస్  (2)


2. ఎరిగినైనా వాడవు నీవు మా సంకల్పములు – పరిశోధించి చూచెదవు మా ఆలోచనలు  (2)

నిను  వెదకినయెడల ప్రత్యక్షమౌదువు  (2)

పూర్ణ మనస్సుతో నిను సేవించెదను (2)

నిను ప్రేమించెదను నీ రూపం పొందెదను (2) 

నీ సంకల్పంలో నేనున్నందున – నను పిలిచి స్వీకరించిన నా దేవా  (2)


3. నశించిపోవును ఎపుడు రాజుల సంకల్పములు –

వ్యర్ధపరచెదవు నీవు అన్యుల ఆలోచనలు (2)

శరణాగతులకు ధైర్యమిచ్చెదవు (2)

పూర్ణ మనస్సుతో నిను సేవించెదను (2)

నిను ప్రేమించెదను నీ రూపం పొందెదను (2)  || నీ సంకల్పంలో ||

Song Credits

Lyrics, Tune, Music & Voice: Dr. A.R.Stevenson

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro