నీ కృపా బాహళ్యం | Nee Krupaa Bahulyam Song lyrics || Telugu Christian Worship Song
Telugu Lyrics
Nee Krupaa Bahulyam Song lyrics in Telugu
నీ కృపా బాహళ్యం నీ ప్రేమ కనికరం
నా యెడల చూపించావు అద్వితియుడా
నీ దయా సంకల్పం నీ కరుణారసం నాపైన
కురిపించావు నజరేయుడా
ఆరాధించెదను నిన్నే ఆరాధించెదను
ఆత్మతో సత్యముతో ఆరాధించెదను (2) || నీ కృపా ||
1. చీకటిలోన పడియున్న నన్ను వెలుగుతో నింపెను నీ కృపయే
ఒంటరితనము గడిపిన నాకు తోడుగా నిలిచెను నీ కృపయే
నా వారు కాని – సంపద కాని కాపాడలేదయ్యా (2)
సమస్తము నీ కృపా క్షేమాధారమే (2)
ఆరాధించెదను నిన్నే ఆరాధించెదను
ఆత్మతో సత్యముతో ఆరాధించెదను (2) || నీ కృపా ||
2. నేనీస్థితిలో ఉన్నానంటే అది కేవలం నీ కృపయే
ఆనందమును ఆరోగ్యమును పొందానంటే నీ కృపయే
నా శక్తి కాదు – భక్తి కాదు – జ్ఞానము కాదయ్యా (2)
సమస్తము నీ కృపా క్షేమాధారమే (2)
ఆరాధించెదను నిన్నే ఆరాధించెదను
ఆత్మతో సత్యముతో ఆరాధించెదను (2) || నీ కృపా ||
3. మోడైపోయిన నా జీవితాన్ని చిగురింపజేసెను నీ కృపయే
పాపపు చెరలో పడియున్న నాకు రక్షణ నిచ్చేను నీ కృపయే
నా పేరు కాని ప్రతిష్ట కాని రక్షించలేదయ్యా (2)
సమస్తము నీ కృపా క్షేమాధారమే (2)
ఆరాధించెదను నిన్నే ఆరాధించెదను
ఆత్మతో సత్యముతో ఆరాధించెదను (2) || నీ కృపా ||
English Lyrics
Nee Krupaa Bahulyam Song lyrics in English
Nee Krupaa Bahulyam Nee Prema Kanikaram
Naayedala Choopinchavu Adhvitheeyudaa
Nee Dhayaa Sankalpam Nee Karunaarasam Naapaina
Kuripinchavu Najareyuda
Aaradhinchedhanu Ninne Aaradhinchedhanu
Aathmatho Sathyamutho Aaradhinchedhanu (2) || Nee Krupaa ||
1. Cheekatilona Padiyunna Nannu Velugutho Nimpenu Nee Krupaye
Ontarithanamu Gadapina Naaku Thodugaa Nilichenu Nee Krupaye
Naa Vaaru Kaani – Sampadha Kaani Kaapadaledhayya (2)
Samasthamu Nee Krupaa Kshemadharame (2)
Aaradhinchedhanu Ninne Aaradhinchedhanu
Aathmatho Sathyamutho Aaradhinchedhanu (2) || Nee Krupaa ||
2. Neneesthithilo Unnanante Adhi Kevalam Nee Krupaye
Aanandhamunu Aarogyamunu Pondhanante Nee Krupaye
Naa Sakthi Kaadhu – Bhakti Kaadhu – Gnaanamu Kaadhayya (2
Samasthamu Nee Krupaa Kshemaadharame (2)
Aaradhinchedhanu Ninne Aaradhinchedhanu
Aathmatho Sathyamutho Aaradhinchedhanu (2) || Nee Krupaa ||
3.Modaipoyina Naa Jeevithanni Chigurimpajesenu Nee Krupaye
Papapu Cheralo Padiyunna Naaku Rakshananichenu Nee Krupaye
Naa Peru Kaani Prathishta Kani Rakshinchaledhayya (2)
Samasthamu Nee Krupaakshemaadhaarame (2)
Aaradhinchedhanu Ninne Aaradhinchedhanu
Aathmatho Sathyamutho Aaradhinchedhanu (2) || Nee Krupaa ||
Song Credits
Lyrics and Tune: Bro.Gunaveer Paul
Vocals: Sister Sangeetha Daniel Paul
Music: Prashant Kumar
Flute: Pramodh
Sitar: Kishore
Shenoy: Balesh
Mix & Master: Ranjith
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs