నీ బాహుబలము ఎన్నడైన | Nee Bahubalamu Enadaina Song Lyrics

Telugu Lyrics

Nee Bahubalamu Song Lyrics in Telugu

నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా

నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా (2)

నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి –

యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ (2)    || నీ బాహుబలము ||


1.ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి –

దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి (2)

అవమానించినవారే అభిమానమును పంచగా –

ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం (2)    || నీ బాహుబలము ||


2.సారవంతమైన తోటలో నను నాటితివి –

సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి  (2)

చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై –

ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును (2)     || నీ బాహుబలము ||


3. విశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ –

పుటము వేసి యున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేనొందుటకు (2)

శ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు –

గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును  (2)    || నీ బాహుబలము ||

English Lyrics

Nee Bahubalamu Song Lyrics in English

Nee Bahubalamu Ennadaina Dhooramayene

Nithya Jeevamichu Needhu Vakku Eppudaina Moogaboyenaa (2)

Nirmala Hrudhayudaa Na Dheepamu Veliginchithivi –

Yesayya Aparamainadhi Naapai Neekunna Athyunnatha Prema (2)   || Nee Bahubalamu ||


1. Intha Goppa Rakshana Kotalo Nanu Nilipithivi –

Dhahinchu Agnigaa Nilichi Virodhi Banamulanu Thappinchithivi (2)

Avamaaninchinva Vare Abhimanamunu Panchaga –

Aanandha Sankethame Ee Rakshana Geethamu  (2)    || Nee Bahubalamu ||


2.Saaravanthamaina Thotalo Nanu Natithivi –

Sarvaadhikaarigaa Thodai Roga Marana Bheethine Tholaginchithivi  (2)

Cheekati Kammina Mabbule Kurisenu Dheevena Varshamai –

Intha Goppa Krupanu Goorchi Yemani Varninthunu  (2)    || Nee Bahubalamu ||


3.Viswasa Veerula Jadalo Nanu Nadipinchuchu-

Putamu Vesi Yunnavu Sampoorna Parishuddhatha Nenondhutaku  (2)

Sramanondhina Yendla Koladhi Sammruddhini Nakicchedhavu –

Goppa Saakshi Sanghamai Siluvanu Prakatinthunu  (2)    || Nee Bahubalamu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Nee Bahubalamu Enadaina Song Lyrics

How to Play on Keyboard

Nee Bahubalamu Enadaina Song on Keyboard

Track Music

Nee Bahubalamu Enadaina Track Music

Leave a comment

You Cannot Copy My Content Bro