నా జీవితానికి యజమానుడా సాంగ్ లిరిక్స్ | Naa Jeevithaniki Yajamanuda Song Lyrics

Telugu Lyrics

Naa Jeevithaniki Yajamanuda Song Lyrics in Telugu

నా జీవితానికి యజమానుడా – నిను మాత్రమే కొలుతునేసయా  (2)

నిత్య మహిమలో నిను చూచే వరకు – నా స్తుతి యాగము ఆపనేసయా (2)

1) కన్నీటి లోయ ఆవేదనల ఛాయ – లోకపు మాయ నే తాళలేనయా  (2)

అరచేతిలో చెక్కుకున్నవాడా  (2)

ఈ జీవితము నీదెనయా నీ వాడనేసయా  (2) (నా జీవితానికి)

2) గుండె జారిపోయె నిందలెన్నో – ఆత్మీయులతో అవమానాలెన్నో  (2)

పోరాడుటకు నా బలము చాలక  (2)

నీ పాదాలపై ఒరిగినానయా ఒదిగిపోతానయా  (2)

3) నా యాత్రలో ఏమి జరిగిన – స్తుతియించుచునే నే సాగిపోదును (2)

నా తనువంతా నీ పని కోసమే (2) నీ అర్పణగా నేను మారితినయా నిన్ను చేరితినయా (2) 

(నా జీవితానికి)

English Lyrics

Naa Jeevithaniki Yajamanuda Song Lyrics in English

Naa Jeevithaniki Yajamanuda – Ninu Maathrame Koluthunesayaa (2)

Nithyamahimalo Ninu Chooche Varaku – Naa Sthuthi Yagamu Aapanesayaa (2)

1) Kanneti Loya Aavedhanala Chaya – Lokapu Maaya Ne Thalalenayaa (2)

Arachethilo Chekkukunnavadaa (2)

Ee Jeevithamu Needhenaya Nee Vaadanesayaa (2) (Nee Jeevithaniki)

2)Gunde Jaaripoye Nindhalennu – Aathmeeyulatho Avamanalenno… (2)

Poradutaku Naa Balamu Chaalaka (2)

Nee Paadalapai Originaanayaa Odhigipothanayaa (2)

3) Naa Yaathralo Emi Jarigina – Sthuthiyinchuchune Ne Saagipodhunu (2)

Naa Thanuvanthaa Nee Pani Kosame.. (2)

Nee Arpanagaa Nenu Maarithinayaa Ninnu Cherithinayaa (2) (Naa Jeevithaniki)

Song Credits

Lyric, Tune, Voice: Bro John J

Music: Sareen Imman

Mix and Master: Praveen Ritmos

Dilruba: Sarojini Garu

Flute: Nathan Garu

Tabla & Dolak: Prabhakar Rella

Rhythms: Kishore Immanuel

DOP: Syam Konala

Title Art: Devanand Saragonda

Design: Munny

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Naa Jeevithaniki Yajamanuda Song Lyrics

Testimony

రాజా నీ సన్నిధిలో పాట రచయిత జాన్ గారి యొక్క సాక్ష్యం

జాన్ గారు ఏలూరు జిల్లా కలిదిండి మండలం అమరావతి అనే చిన్న పల్లెటూరులో జన్మించారు. విగ్రహారాధన కుటుంబం లో జన్మించారు.

ఇంట్లోనే మారెమ్మ అనే ఇలవేల్పును పెట్టుకొని పూజలు చేసేవారు. వాళ్ళ నాన్న గారు శ్రీరామ నవమి రోజు జాన్ గారు పుట్టారని అంతర్వేది తీసుకెళ్లి రాము అని పేరు పెట్టారు.

అదేరోజు ఆయనకు జ్వరం వచ్చి తరువాత అది పోలియో వ్యాధిగా మారింది. తర్వాత వాళ్ళు హాస్పిటల్ లు చుట్టూ 6 నెలలు ట్రీట్మెంట్ కోసం తిరిగారు.

6 నెలల తర్వాత కుడి కాలుకు ఉన్న పోలియో వ్యాధి ఎడమ కాలికి కూడా వచ్చి పూర్తిగా అవిటి వాడు అయ్యిపోయాడు. డాక్టర్లు ఇంకా నడక లేదని ఇంకా జీవితాంతము ప్రాకుతూ దేకుతూ ఉండాల్సిందే అని చెప్పారు.

Raja nee Sannidhilo songwriter John Testimony
Brother John Testimony

అప్పుడు జాన్ గారి తండ్రి స్నేహితుడు అన్ని చోట్లకు వెళ్తున్నావుకదా ఈ ఒక్క సరికి యేసయ్య చర్చి కి వచ్చి చూడు. నచ్చకపోయినా పిల్ల వాడి మేలుకోసం ఒక్క సారి వచ్చి చూడమని చెప్పాడు.

ఆలా వాళ్ళ నాన్నగారు ఒకసారి మందిరానికి రాగా ఆ రోజు దేవుడు జాన్ గారి నాన్నతో మాట్లాడాడు. దేవుని సేవ కోసం ప్రతిష్టించుకోమని దేవుడు ఆయనతో చెప్పగా అయన దేవుని నిమిత్తం తాను అన్ని వదిలేసి దేవుని సేవ కోసం రాగ దేవుడు సహోదరుడు జాన్ గారిని సంపూర్ణం గా స్వస్థపరిచాడు. ఆయన చురుకుగా పరిగెత్తే అంతగా అయన బాగుపడ్డాడు.

ఆలా జాన్ గారు వాళ్ళ నాన్నతో కలిసి పరిచర్యలో పలు పొందుతుండగా 2017లో దేవుడు “రాజా నీ సన్నిధిలో ” పాత రాయడానికి కృప చూపించారు.

జాన్ గారు వాళ్ళ నాన్నతో కలిసి పరిచర్యలో సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ బంధువులు ఒక స్థలం అమ్మితే వాళ్ళ నాన్న గారి భాగం ఇస్తే అయన ఆ డబ్బుతో ఒక స్థలాన్ని దేవుని మందిరం కోసం వినియోగించారు.

తరువాత వాళ్లకు ఉన్న 45 సెంట్ల స్థలాన్ని అమ్మి డబ్బు తీసుకురాగా సహోదరుడు జాన్ గారు నాన్న ఇంకా మన కష్టాలు తీరిపోయాయి ఇంకా మనం మంచి జీవితాన్ని జీవించవచ్చు అని అన్నాడు.

దానికి వాళ్ళ నాన్న గారు ఇది దేవుని మందిరం నిర్మించడానికి బాబు ఇది మన కోసం కాదు అని చెప్పగా జాన్ గారు కోపంతో రగిలిపోయి ఇంకా అన్ని దేవుడికైతే నేను తమ్ముడు చిప్పపట్టుకొని తిరగడమేనా అని విసుగుతో చెప్పి ఇంకా నేను సేవలో పాల్గొనను నీకిష్టం వచ్చింది చేసుకో నాన్న అని కోపంతో వాదించారు.

వాళ్ళ నాన్న గారు ఏడుస్తూ పెద్దోడా నువ్వే ఆలా అంటే చిన్నోడు పరిస్థితి ఏంటిరా అర్ధం చేసుకోరా అని చెప్పిన వినకుండా వెళ్ళిపోయాడు. ఆరోజు నుండి జాన్ గారు సేవలో తన తండ్రి సేవలో పాల్గొనలేదు.

అయన ఒక మీటింగ్ లో కీబోర్ట్డ్ ప్లేయర్ గా మ్యూజిక్ చేసి ఇంటికి అలసిపోయి వచ్చి పడుకున్నప్పుడు ఆయనకు ఒక స్వరం వినిపించింది. నువ్వు ఇంకా 2016 సంవత్సరం చూడవు అని. అప్పటినుండి ఆయనకు ఆలోచనలు ఎక్కువయ్యాయి. ఇది తన తండ్రి తో కూడా షేర్ చేసుకొన్నారు.

తరువాత ఒకడు నన్ను చంపేది ఏంటి నేనే చస్తాను అనే మొండి ధైర్యముతో చావడానికి పలు ప్రయత్నాలు చేసేవారు. గోడకి తలకాయ వేసి కొట్టుకోవడం, ఫ్యాన్ కి వేలాడటం, 2 సార్లు వేగంగా వెళ్తున్న లారీ కింద కూడా పడ్డారు. అయితే కొన్ని గాయాలతో తప్పించుకున్నారు.

ఒకసారి మీటింగ్ కి మ్యూజిక్ ప్లే చెయ్యడానికి వెళ్లి వస్తుండగా రాత్రి 2 గంటలు సమయంలో వచ్చే దారిలో పెద్ద బ్రిడ్జి ఉంది. అది ఒక సూసైడ్ స్పాట్. అక్కడ నుండి దూకి తన ప్రాణాలు తీసుకోవాలని దాని మీద ఎక్కి తాను మాటలాడుచుండగా అదే సమయంలో దేవుడు తన తల్లితండ్రులను నిద్ర లేపి నీ పెద్ద కొడుకు చనిపోబోతున్నాడు ప్రార్ధించండి అనగానే వాళ్ళు మోకాళ్లూని ఏడుస్తూ భారంగా ప్రార్థిస్తున్నారు.

అదే సమయం లో దేవుడు జాన్ గారి తో నేను నీ తండ్రిఐన మోషే దేవుడను, నా కోసమే నువ్వు పనిచేయమని ఆయనతో అడగడం జరిగింది.

అయన రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా అనే పాట రాసి రోజు ఆ పాటను పాడుతూ ఏడ్చుకొనేవారు. యేసయ్య 2020 లో పాటను రిలీజ్ చెయ్యమని చెప్తే ఆ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసి రిలీజ్ చేసారు.

ఆ పాట చాల సక్సెస్ అయ్యింది అలాగే అయన కూడా పరిచర్య లో అభివృద్ధి పొందుతూ ఉన్నారు

Leave a comment

You Cannot Copy My Content Bro