మార్గము చూపుము ఇంటికి | Margamu Chupumu Intiki Lyrics

మార్గము చూపుము ఇంటికి | Margamu Chupumu Intiki Lyrics || Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Margamu Chupumu Intiki Lyrics in Telugu

మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి

మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2)


1. పాప మమతల చేత – పారిపోయిన నాకు – ప్రాప్తించె క్షామము

పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు – పంపుము క్షేమము (2)

ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు – పుట్టించె ధైర్యము (2)    || మార్గము ||


2. ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు – తండ్రిని వీడితి

ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ – దేహీ నిను చేరితి (2)

దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు – దారిని జూపుము (2)    || మార్గము ||


3. దూర దేశములోన – బాగుందుననుకొనుచు – తప్పితి మార్గము

తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల – తరిమే దారిద్య్రము (2)

దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి – ధన్యుని చేయుము (2)    || మార్గము ||


4. అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు- ఆకలి బాధలో

అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ – అలవడెను వేదన (2)

అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత – ఆశ్రయము గూర్చుము (2)     || మార్గము ||


5. కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు – కోపించి వెళ్ళితి

కూలి వానిగనైన – నీ యింట పని చేసి – కనికరమే కోరుదు (2)

కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు – క్షమియించి బ్రోవుము (2)    || మార్గము ||


6. నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి – నాపై బడి ఏడ్చెను

నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి – నన్నూ దీవించెను (2)

నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో – సాక్ష్యమై యుండును (2)    || మార్గము ||

English Lyrics

Margamu Chupumu Intiki Lyrics in English

Margamu Chupumu Intiki – Naa Thandri Intiki

Madhurya Prema Prapanchamo – Choopinchu Kantiki (2)


1. Paapa Mamathala Chetha – Paaripoyina Naku – Prapthinche Kshaamamu

Paschattapamunondhi – Thandri Kshama Koruchu – Pampumu Kshemamu (2)

Prabhu Needhu Siluva – Mukhamu Chellanini Naku – Puttinche Dhairyamu (2)

|| Maargamu ||


2. Dhaname Sarvambanuchu – Sukhame Swargambanuchu – Thandri Ni Veediti

Dharani Bhogamulella – Brathuku Dhvansamu Jeya – Dehi Ninu Cherithi (2)

Dehee Ani Nee Vaipu – Chethuletthina Naku – Dhaarini Joopumu (2)

|| Maargamu ||


3. Dhooradeshamuloni – Baagundhunanukonuchu – Thappithi Maargamu

Tharalipoyiri Nenu – Nammina Hithulella – Tharime Dhaaridyramu (2)

Dakshinyamurti Nee – Dhaya Napai Kuripinchi – Dhanyuni Cheyummu (2)

|| Maargamu ||


4. Ammukontini Nenu – Adhamudokaniki Nadu – Aakali Badhalo

Anyayamayipoye – Pandhulu Saha Veliveya – Alavadenu Vedhana (2)

Adugante Avineethi – Melkoniyae Maanavatha – Aasrayamu Goorchumu (2)

|| Maargamu ||


5. Kodukune Kadhananuchu – Gruhame Cherasaalanuchu – Kopinchi Vellithi

Kooli Vaanigaina – Nee Inta Pani Chesi – Kanikaramae Korudhu (2)

Kadhanaku Naa Thandri – Dikkewvarunu Leru – Kshamiyinchu Brovumu (2)

 || Maargamu ||


6. Naa Thandri Nanu Joochi – Parugidichu Yethenchi – Naapai Badi Yedchenu

Nava Jeevamunu Goorchi – Intiki Thodkoni Velli – Nannu Dheevinchenu (2)

Naa Jeevitha Kathayantha – Yesu Premaku Dharalo – Saakshyamai Yundunu (2)

|| Maargamu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Dr, MASILAMANI Garu

Ringtone Download

Margamu Chupumu Intiki Ringtone Download

Mp3 Song Download

Margamu Chupumu Intiki Mp3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro