లంగరేసినావా నా నావకు | Langaresinaava Naa Navaku Song Lyrics

Langaresinaava Naa Navaku Song Lyrics | లంగరేసినావా నా నావకు – Singer Sister Kanthi Kala

Telugu Lyrics

Langaresinaava Naa Navaku Song Lyrics in Telugu

లంగరేసినావా నా నావకు – కొట్టుకొని పోకుండా నే చివరకు

లంగరేసినావా నా నావకు -పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు

అలలను అదిమిపెట్టి అలజడి అణగగొట్టి – తీరం చేరేదాక నావలోన అడుగుపెట్టి

కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి – ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంక బెట్టి

లోక సంద్రాన నా జీవ నౌక – అద్దరికి చేరేదాక సాగు గాక

నీ దరికి చేరేదాక సాగు గాక


1) చుట్టు వున్న లోకం మాయదారి (మాయ) సుడిగుండం – నట్టనడి సంద్రాన

పట్టి లాగే వైనం (2)

రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే

ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే

నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే – నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె

చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2)

ఆహా ఎంత చల్లిని చూపు  – ఆహా ఎంత చల్లని నీ చూపు  || అలలను అదిమిపెట్టి ||


2. సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే – సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)

శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే – వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే

యే దారి కానరాక దిక్కులేక నేనుంటే – నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే

చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2)

ఆహా ఎంత చల్లిని చూపు  – ఆహా ఎంత చల్లని నీ చూపు  || అలలను అదిమిపెట్టి ||


3) జీవ వాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి – జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)

నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి – నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి

నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి – క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి

చూస్తాను నీవైపు… ఊ.. ఊ.. – చూస్తాను నీవైపు ఊపిరి ఉన్నంత సేపు

నాలో ఊపిరి ఉన్నంత సేపు    || అలలను అదిమిపెట్టి ||

English lyrics

Langaresinaava Naa Navaku Song Lyrics in English

Langaresinaava Na Naavaku – Kottukoni Pokunda Ne Chivaraku

Langaresinaava Na Naavaku – Pattu Jaari Pokunda Naa Brathukuku

Alalanu Adhimipetti Alajadi Anagagotti – Theeram Cheyredhaaka Naavalona Adugupetti

Kalavaramidichipetti Kalathanu Tharimikotti – Oopiri Aagedhaaka Premathone Chanka Betti

Loka Sandhraana Na Jeeva Nauka – Addhariki Cheyredhaaka Saagu Gaaka

Nee Dhariki Cheyredhaaka Saagu Gaaka


1. Chuttu Unna Lokam Mayadaari (Maaya) Sudigundam – Nattanadi Sandraana

Patti Laage Vainam (2)

Raakaasi Alalenno Egasi Egasi Paduthunte

Munchesi Nanu Choostu Murisi Murisi Pothunte

Naa Aashalanni Karigi Vantariga Nenunte – Niraasha Valalu Thempi Nireekshanatho Nanu Piliche

Chooshaanu Nee Vaipu… Oo.. Oo.. (2)

Aaha Entha Challini Choopu – Aaha Entha Challani Nee Choopu   || Alalanu Adhimipetti ||


2. Sandehala Gaali Thufaanu Saaganeeka Aaputhuntunte – Satya Vaakya Jadaleka Oda Braddhalauthunte (2)

Shodhana Keratale Egiri Egasi Padutunte – Vedhana Sudulenno Tharimi Tharimi Koduthunte

Ye Dhaari Kaanaraka Dhikkuleka Nenunte – Nee Dhaari Nenantu Nadichinavu Na Vente

Chooshaanu Nee Vaipu… Oo.. Oo.. (2)

Aaha Entha Challini Choopu – Aaha Entha Challani Nee Choopu

|| Alalanu Adhimipetti ||


3. Jeeva Vaakku Chethabatti Nee Chitthanni Madhina Betti – Jeevadhaata Needhu Seve Jeevitanikardhamantu (2)

Naa Venuka Vunnavi Marachi Mundhunna Vaatini Thalachi – Netrasha Sareerasha Jeevapudambanni Vidadhi

Ninu Jerarammantu Jagamantha Ne Pilachi – Kreestesu Krupalo Nilichi Papapu Lokanni Gelichi

Choosthanu Neevaipu… Oo.. Oo.. – Choosthanu Neevaipu Oopiri Unnantha Sepu

Naalo Oopiri Unnantha Sepu || Alalanu Adhimipetti ||

Song Credits

Lyrics and Tune: Sister Kanthi Kala

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

4 thoughts on “లంగరేసినావా నా నావకు | Langaresinaava Naa Navaku Song Lyrics”

Leave a comment

You Cannot Copy My Content Bro