క్రీస్తు నేడు పుట్టెను | Kreesthu Needu Puttenu Song Lyrics

క్రీస్తు నేడు పుట్టెను | Kreesthu Needu Puttenu Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Kreesthu Needu Puttenu Song Lyrics in Telugu

క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా హల్లెలూయా  – జగమంతా చాటను

నిండు మనసుతో పరవశించను (2)

రారాజు మహారాజు జన్మించే ఈ ధరలో – కొనియాడి కీర్తించి ఆరాధించెదము

సంతోషమే సమాధానమే – ఆశ్చర్యమే మహదానందమే (2)


1. సంతోషకరమైన శుభవార్త – కాపరులకు తెలిసే ఈ వార్త

లోకంలో లేని సంతోషం – భువిపై తెచ్చింది ప్రభువార్త (2)

కృంగిన జీవితాలకు కృప చూపెను ఈ క్రిస్టమస్  – భయముతో ఉన్నవారిని

బలపరచెను ఈ క్రిస్మస్ (2)

సంతోషమే సమాధానమే – ఆశ్చర్యమే మహదానందమే (2) || క్రీస్తు నేడు ||


2. నిరీక్షణలేని జనులకు నిరీక్షణ తెచ్చింది ఈ వార్త

రక్షణలేని జనులకు రక్షణ తెచ్చింది ప్రభు వార్త (2)

పాపముతో ఉన్న వారిని పవిత్రపరచును క్రిస్మస్ – బాధలలో ఉన్నవారిని

బలపరచును ఈ క్రిస్మస్ (2)

సంతోషమే సమాధానమే – ఆశ్చర్యమే మహదానందమే (2) || క్రీస్తు నేడు ||


3. సమాధానం లేని మనుషులకు సమాధానం తెచ్చెను ఈ వార్త

సమాధాన పరచెను తండ్రితో శాంతి నొసగే ఈ ప్రభువార్త  (2)

లయమయ్యే జీవితాలను లేవనెత్తు ఈ  క్రిస్మస్  – వ్యథలతో ఉన్నవారిని

 ఉత్తేజపరచును క్రిస్మస్ (2)

సంతోషమే సమాధానమే – ఆశ్చర్యమే మహదానందమే (2) || క్రీస్తు నేడు ||

Song Credits

Lyrics,Tune & Voice : Moses Undru

Music: J K Christopher

Guitars: Sunny Raj

Music programming: Jk Christopher and Prakash Rex

Editing & VFX: David Varma

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro